Karthika Deepam: మోనితను చంపడానికి వెళ్తున్న డాక్టర్ బాబు.. సీరియల్‌లో కీలక మలుపు!

Karthika Deepam

Karthika Deepam: బుల్లితెరలో మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ కు మామూలు ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీలు కూడా బాగా అలవాటు పడ్డారు.

  • Share this:
    Karthika Deepam: బుల్లితెరలో మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ కు మామూలు ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీలు కూడా బాగా అలవాటు పడ్డారు. ప్రస్తుతం ట్విస్ట్ లతో బాగా సాగుతున్న ఈ కథను చూసి ప్రేక్షకులు అసలు మిస్ అవ్వట్లేదు. ఇదిలా ఉంటే భాగ్యం మోనితను కిడ్నాప్ చేయాలని మోనిత ఇంటికి వెళ్లి.. కార్తీక్ నిన్ను చంపడానికి కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు అని అనడంతో మొదట ఇదంతా నిజమే అనుకొని మోనిత భయపడుతుంది. కానీ అంజి కూడా డాక్టర్ బాబు దగ్గరే ఉండని చెప్పేసరికి మోనిత.. ఇదంతా భాగ్యం ఆడిన నాటకమని అనుకుంటూ.. సరే పిన్ని ఇకనుండి వెళ్దాం అని తన గదిలోకి భాగ్యమని తీసుకెళ్తుంది. ఇక అక్కడ కొన్ని మాటలు మాట్లాడుతూ భాగ్యమును కొట్టి నోటికి ప్లాస్టర్, తాడు కట్టి పడేసి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

    మరోవైపు కార్తీక్..దీపను ఎక్కడికి వెళ్ళావు అని ప్రశ్నిస్తాడు. కానీ దీప మాత్రం ఆ విషయాన్ని చెప్పకుండా ఒక చోటకు వెళ్ళమని చెబుతుంది. ఇక భాగ్యం భర్త భాగ్యం లేకపోయేసరికి టెన్షన్ పడతాడు. ఓవైపు భాగ్యం భర్త భాగ్యానికి ఫోన్ చేస్తాడు. భాగ్యం మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితుల్లో ఉండి తన భర్త గురించి ఆలోచిస్తుంది. ఇక అంజి అక్కడున్న వ్యక్తిని కొడుతున్న సమయంలో అంతలోనే ఎవరో వస్తారు. ఇక డోర్ కొట్టడంతో వెళ్లి చూసేసరికి కార్తీక్ కనిపిస్తాడు. కార్తీక్ అంజిని తన ప్రశ్నలతో కడిగి పారేసాడు. అంజి మాత్రం హిమను చంపింది మోనితనే అని నిజం చెప్పిన కూడా నమ్మడు. దీప నిన్ను నమ్ముతుంది కాబట్టి నీకు ఏ సహాయం కావాలో అది చేస్తానంటాడు కార్తీక్. మోనితను మాత్రం నమ్మొద్దని అంజి ఎమోషనల్ గా చెప్తాడు. కార్తీక్ సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

    దీప తన ఇంట్లో ఆలోచిస్తూ ఉండగా తన తండ్రి వచ్చి మీ పిన్ని కనిపించటం లేదని అంటాడు. తెగ టెన్షన్ పడుతూ కనిపించగా దీప ఓదారుస్తుంది. దీప కూడా భాగ్యం ఫోన్ చేయగా ఫోన్ ఎత్తకపోతే సరికి ఆలోచనలో పడతారు. ఇద్దరు భాగ్యం గురించి ఎమోషనల్ అవుతారు. ఇక మోనితకు అంజి తప్పించుకున్నాడని ఫోన్ రావడంతో తెగ టెన్షన్ పడుతుంది.

    Karthika Deepam
    Karthika Deepam


    ఇక ఆనందరావు, ఆదిత్య 25 న పెళ్లి గురించి మాట్లాడుతుంటారు. భాగ్యం గురించి కూడా మాట్లాడుకుంటారు. మరోవైపు దీప ఆలోచిస్తూనే ఉండగా.. పిల్లలు 25 తారీకును గుర్తు చేస్తారు. దీప మరింత టెన్షన్ పడుతుంది.ఇక కార్తీక్ కు అంజిని.. మోనిత బెదిరిస్తున్న వీడియోను చూపిస్తుంది దీప. ఇక కార్తీక్ కారులో వెళుతుండగా దీప ఫోన్ చేసి ఎక్కడికి అని అడగటంతో డాక్టర్ భారతి వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిందని చూడ్డానికి వెళ్తున్నానని చెబుతాడు. ఇక తన మనసులో చనిపోయిన వాళ్లని చూడ్డానికి కాదు మోనితను చంపడానికి వెళ్తున్నానని అంటాడు.
    Published by:Navya Reddy
    First published: