ప్రభాస్ ప్రొడక్షన్‌లో క్రేజీ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ సినిమా..

ప్రస్తుతం వరుణ్ తేజ్..హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ సినిమా  చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

news18-telugu
Updated: September 11, 2019, 9:33 AM IST
ప్రభాస్ ప్రొడక్షన్‌లో క్రేజీ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ సినిమా..
ప్రభాస్,వరుణ్ తేజ్ (file Photos)
  • Share this:
ప్రస్తుతం వరుణ్ తేజ్..హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ సినిమా  చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా ఈ సినిమాలో వరుణ్ తేజ్.. లుక్స్, మేనరిజం, నటన ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. ఈ సినిమా తమిళంలో హిట్టైయిన ‘జిగర్తాండ’కు రీమేక్. తమిళంలో బాబీ సింహా చేసిన పాత్రను ఈ సినిమాలో వరుణ్ తేజ్ చేసాడు. సిద్దార్ధ్ చేసిన పాత్రను తెలుగులో తమిళ హీరో అథర్వ చేసాడు. ఈ సినిమాను ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్.. మేర్లాపాక గాంధీ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాను ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ సంస్ధ నిర్మించనుంది.

వరుణ్ తేజ్,మేర్లపాక గాంధీ (Facebook/Photo)


ఈ సినిమాను ఈ యేడాది చివర్లో పట్టాలెక్కనుంది. అంతేకాదు వచ్చే సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. త్వరలో ఈ సినిమా విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 11, 2019, 9:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading