హోమ్ /వార్తలు /సినిమా /

Naga Chaitanya : అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... అప్పుడే ఓ ఇంటివాడు కాబోతున్న నాగ చైతన్య...

Naga Chaitanya : అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... అప్పుడే ఓ ఇంటివాడు కాబోతున్న నాగ చైతన్య...

Naga Chaitanya Photo : Twitter

Naga Chaitanya Photo : Twitter

Naga Chaitanya : సెలెబ్రిటీ జంట నాగచైతన్య. సమంత తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన విష‌యం తెలిసిందే. చైతన్య, సమంతలు సడెన్’గా సామాజిక మాధ్య‌మాల్లో అధికారికంగా విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌ట‌ించారు. ఇక అది అలా ఉంటే నాగ చైతన్య త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

  సెలెబ్రిటీ జంట నాగచైతన్య, (Naga Chaitanya) సమంత తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన విష‌యం తెలిసిందే. కొన్ని రోజులుగా మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నప్ప‌టికీ స్పందించ‌ని చైతన్య, సమంతలు సడెన్’గా సామాజిక మాధ్య‌మాల్లో అధికారికంగా విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌ట‌ించారు. దీంతో షాక్ అవ్వడం అక్కినేని ఫ్యాన్స్ వంతు అయ్యింది. ఇక సమంతతో విడాకుల తర్వాత చైతన్య ఒంటరిగా ఉండాలనీ కోరుకుంటున్నారట.. అందులో భాగంగా ఆయన హైదరాబాద్‌లో ఓ కాస్లీ ఏరియాలో ఓ కొత్త ఫ్లాటు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఆయన అక్కడే ఒంటరిగా ఉంటారట. చైతన్య గత సంవత్సరం జూబ్లీహిల్స్‌లో ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ బంగ్లాకు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ పనులు పూర్తయిన తర్వాత, చైతన్య ఎంతో ఇష్టపడి కొన్న ఆ బంగ్లాకు మారతారని తెలుస్తోంది.

  ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే.. చైతన్య లవ్ స్టోరి  (Love story) తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న థాంక్యూ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య, రాశీఖన్నా జంటగా నటిస్తున్నారు. గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతన్య నటించిన సంగతి తెలిసిందే. అక్కినేని హీరోలతో విక్రమ్ 'మనం' వంటి వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన కొన్ని సినిమాలు పెద్దగా అలరించలేకపోతున్నాయి.

  Love Story on Aha : ఆహాలో నాగ చైతన్య, సాయి పల్లవిల లవ్ స్టోరి.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు...

  విక్రమ్ మనం తర్వాత మరోసారి అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో మాత్రం కొంత నిరాశ పరిచింది. ఆ తర్వాత విక్రమ్ నానితో గ్యాంగ్ లీడర్ అనే థ్రిల్లర్‌ను తీశారు. అయితే ఆ సినిమా కథ బాగున్న పెద్దగా అలరించలేకపోయింది. దీంతో ఈ సినిమాను పక్కాగా ప్లాన్ చేశారట. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటీ ఫలితాన్ని ఇవ్వనుందో.. థాంక్యూ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

  ఈ సినిమా తర్వాత చైతన్య ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు  చైతన్య మరో సినిమాకు కూడా సై అన్నట్లు తెలుస్తోంది. హీరో, నిర్మాత, దర్శకుడైన అర్జున్ ఇప్పటికే కొన్ని విజయవంతమైన సినిమాలను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా అర్జున్ నాగ చైతన్యకు ఓ స్టోరిని వినిపించారట. అర్జున్ చెప్పిన యాక్షన్ కథ చైతన్యకు బాగా నచ్చడంతో సినిమా చేయడానికి చైతన్య ఓకే అన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఓరేంజ్‌లో ఉంటాయట. ఇప్పటికే నాగచైతన్య మూడు సినిమాలకు కమిట్ అయ్యారు. వీటితో పాటు 'బంగార్రాజు' 'నాగేశ్వరరావ్' సినిమాల్లో నటించనున్నారు.

  MAA Elections : ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం.. మా సభ్యత్వానికి రాజీనామా..

  ఇక చైతన్య తాజా సినిమా లవ్ స్టోరి సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే ముప్పై రెండు కోట్ల షేర్ సాధించి.. ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను (Aha) ఆహా ఓటీటీ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా ఆహాలో అక్టోబర్ 22న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు జనరల్ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్ స్టార్ మా (Star Maa) సొంతం చేసుకుంది. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్ని పోషించారు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Naga Chaitanya, Tollywood news

  ఉత్తమ కథలు