చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా సక్సెస్‌తో చిరంజీవి..ఇపుడు కొరటాల శివతో చేయబోయే సినిమాలో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారట. ‘సైరా’ తెలుగులో సక్సెస్ అయిన మిగతా భాషల్లో అంతగా వర్కౌట్ కాలేదు. అది పక్కనపెడితే.. చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ తెలుగులో మాత్రం దూసుకుపోతుంది. ఐతే.. ‘సాహో’ తరహాలో హిందీ సహా మిగతా భాషల్లో ‘సైరా నరసింహారెడ్డి’ అంతగా వర్కౌట్ కాలేదు. ఐనా.. కొరటాల శివ సినిమాను కూడా ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నారు మెగా కాంపౌండ్ వర్గాలు.

చిరంజీవి, కొరటాల శివ
ఈ సినిమాను కూడా దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేయనున్నారు.. అందుకు తగ్గట్టుగానే బడ్జెట్, నటీనటుల ఎంపిక చేస్తున్నారు. ఎక్కువ మటుకు తెలుగు నటీనటులతో పాటు మిగతా భాషలకు చెందిన యాక్టర్స్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించబోతున్నట్టు సమాచారం. వచ్చే నెలలో ఈ సినిమాను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించనున్నారు. మొత్తానికి సైరా రిజల్ట్ ఎఫెక్ట్... చిరంజీవి, కొరటాల శివ కొత్త సినిమాపై పడింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:October 05, 2019, 16:00 IST