మ్యూజిక్ వరల్డ్‌లో కూడా ఆత్మహత్యలు... గాయకుడు సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు..

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ బాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీస్‌లో జరగుతున్నచీకటి బాగోతాలపై స్పందించారు.

news18-telugu
Updated: June 19, 2020, 1:28 PM IST
మ్యూజిక్ వరల్డ్‌లో కూడా ఆత్మహత్యలు... గాయకుడు సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు..
సోనూ నిగమ్ ఫైల్ ఫోటో
  • Share this:
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే ఈయన ఆత్మహత్య చేసుకుని చనిపోవడం తట్టుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో వారసత్వంతో  బయటి వాళ్లను ఎదగనీయకుండా ఎంత స్థాయిలో తొక్కేస్తున్నారనేది మరోసారి అర్థమైపోయింది. ఈయన మరణంతో కొందరు సినీ ప్రముఖులు బయటికి వచ్చి రచ్చ చేస్తున్నారు. కరణ్ జోహార్, సల్మాన్ సహా చాలా మందిని ఏకి పాడేస్తున్నారు. వాళ్లు పెట్టిన మానసిక క్షోభ కారణంగానే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నెటిజన్స్ ఆలియా, కరణ్ జోహార్, సల్మాన్‌ ఖాన్‌ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌లో పాతుకుపోయిన బంధుప్రీతి వారసత్వంపై ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. త్వరలో సంగీత ప్రపంచంలో కూడా ఆత్మహత్యలు చూస్తారని సోనూ చెప్పడం గమనార్హం.
View this post on Instagram

You might soon hear about Suicides in the Music Industry.

A post shared by Sonu Nigam (@sonunigamofficial) on
సంగీత ప్రపంచంలో కొంత మందే గుత్తాధిపత్యం రాజ్యమేలుతుందని చెప్పుకొచ్చాడు. మ్యూజిక్‌ ప్రపంచంలో రెండు కంపెనీలు మాత్రమే పాడిందే పాటగా నడుస్తోందన్నారు. ఏ సినిమాలో ఎవరు పాడాలో పాడకూడదో వాళ్లే నిర్ణయిస్తున్నారన్నారు. వాళ్ల వల్ల టాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు రాకుండా పోతున్నాయన్నారు. బాలీవుడ్‌లో కంటే సంగీత ప్రపంచంలోనే మాఫియా పెద్దదంటూ చేసిన వ్యాఖ్యలు ఇపుడు బాలీవుడ్‌లో ఉన్న మరో చీకటి కోణాన్ని బహిర్గతం చేసిందన్నారు.
First published: June 19, 2020, 1:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading