• HOME
 • »
 • NEWS
 • »
 • MOVIES
 • »
 • AFTER SUSHANT SINGH RAJPUT SUICIDE NETIZENS UNFOLLOW ALIA BHATT KARAN JOHAR TA

సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆలియా భట్‌కు దిమ్మదిరిగే షాక్..

సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆలియా భట్‌కు దిమ్మదిరిగే షాక్..

ఆలియాకు షాక్ ఇచ్చిన నెటిజన్స్ (Twitter/Photo)

హీరోగా మంచి ఫ్యూచర్ ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఆలియాకు నెటిజన్స్ దిమ్మ దిరిగే షాక్ ఇచ్చారు.

 • Share this:
  హీరోగా మంచి ఫ్యూచర్ ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఈయన మరణానికి బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఉన్న కుళ్లు వారసత్వ రాజకీయాలే కారణం అని  కంగనా రనౌత్‌తో పాటు వివేక్ ఓబరాయ్, రవీనా టాండన్ సహా పలువురు ప్రముఖులు కరణ్ జోహార్, ఆలియాభట్, సల్మాన్‌ఖాన్‌ను ఏకి పారేస్తున్నారు. అంతేకాదు వాళ్లు పెట్టిన మానసిక క్షోభ కారణంగానే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోసుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనుక బాలీవుడ్ ప్రముఖుల హస్తం ఉందని గట్టి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో బిహార్‌లోని ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్ ఓఝా న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. 8 మంది బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్ సింగ్‌ను ఆత్మహత్యకు పురికొల్పారని అందులో ఫిర్యాదు చేశారు. సుశాంత్ ఆత్మహత్య వెనక ఆలియా భట్ ప్రమేయం ఎక్కువగా ఉందనే వాదన వినిపిస్తోన్న నేపథ్యంలో ఆలియా భట్‌కు నెటిజన్లు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు.

  సుశాంత్ సింగ్ అలియా భట్ (sushant singh rajput alia bhatt)
  సుశాంత్ సింగ్ అలియా భట్ (sushant singh rajput alia bhatt)


  సోసల్ మీడియాలో ఆలియా భట్‌‌ను ఫాలో అవుతున్న వారు సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో వీరిని అన్ ఫాలో చేస్తున్నారు. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఆలియా భట్‌కు నెటిజన్లు షాక్ ఇచ్చారు. ఆమె తక్కువ వ్యవధిలోనే 4.45 లక్షల మంది ఫాలోవర్స్ కోల్పోయింది. ఇక స్టార్ కిడ్స్‌కే ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్న కరణ్ జోహార్‌ 1.88 లక్షల మంది అన్‌ఫాలో చేశారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను అనుసరించే వాళ్లు 50 వేల మంది ఆయన్ని అన్ ఫాలో చేసారు. మొత్తంగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో నెటిజన్స్ ఈ రకంగా వీరిపై రివేంజ్ తీసుకుంటున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: