Surgical Strikes.. ‘URI 2.O’ మూవీకి రంగం సిద్ధం..

‘URI’ సీక్వెల్

గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు నిర్మాతలకు వసూళ్ల పంట పండిస్తున్నాయి. తాజాగా మన దేశాన్ని దొంగ దెబ్బ తీసిన పాకిస్థాన్‌పై మన దేశ సైనికులు జరిపిన మెరుపు దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ‘URI’ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మెరుపు వసూళ్లను సాధిస్తూనే ఉంది. తాజాగా భారత వాయుసేన పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరిపిన సర్జికల్ దాడుల నేపథ్యంలో ‘URI’ సినిమాకు సీక్వెల్ తెరకెక్కే అవకాశాలున్నాయి.

  • Share this:
గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు నిర్మాతలకు వసూళ్ల పంట పండిస్తున్నాయి. తాజాగా మన దేశాన్ని దొంగ దెబ్బ తీసిన పాకిస్థాన్‌పై మన దేశ సైనికులు జరిపిన మెరుపు దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ‘URI’ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మెరుపు వసూళ్లను సాధిస్తూనే ఉంది..

ఆదిత్య ధర్ దర్శకత్వంలో విక్కీ కౌశ‌ల్, యామీ గౌత‌మ్ జంట‌గా న‌టించిన ఈ చిత్రం పాకిస్థాన్ పై ఇండియా చేసిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ నేప‌థ్యంలో తెరకెక్కింది. తొలిరోజు నుంచే టాక్ బ్ర‌హ్మాండంగా ఉండ‌టంతో URI కి తిరుగులేకుండా పోయింది. జ‌న‌వ‌రి 11 న విడుద‌లైన ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సర్జికల్ స్ట్రైక్ చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.250 కోట్లను వసూళ్లు సాధించి ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్‌గా ఉంది.

మరోవైపు  ఈ నెల 14న సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 40 మంది జవాన్లను పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌కు చెందిన ముష్కరులు పుల్వామా దగ్గర దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే కదా.  ఈ దాడిలో అసువులు బాసిన సైనికుల కోసం కాశ్మీర్ టూ కన్యాకుమారి వరకు దేశ వ్యాప్తంగా ప్రజలందరు సంఘీభావం ప్రకటించారు. అంతేకాదు 40 మంది వీర జవాన్ల మరణానికి ధీటైన సమాధానం కోసం భారత దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. తాజాగా వీర జవానుల వీర మరణంపై భారత వాయుసేన బాలాకోట్ దగ్గర ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్నారు.

పుల్వామా దాడికి ప్రతీకారంగా ఎయిర్ ఫోర్స్ జరిపిన సర్జికల్ స్ట్రైక్‌ను దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కొనియాడున్నారు. తాజాగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్ దగ్గర మన భారత వాయుసేన జరిపిన సర్జికల్ దాడుల నేపథ్యంలో ‘URI’ సినిమాకు సీక్వెల్‌కు కథ దొరికినట్టైంది. తొందర్లనే భారత వాయుసేన జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా మరో సినిమా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

 

 

 
First published: