మహేష్ బాబు తర్వాత అఖిల్ కూడా ఆ పని చేసేసాడు..

అవును మహేష్ బాబు స్థాపించిన ఏఎంబీ సినిమాస్‌లో మహేష్ బాబు అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమా చూసారు. తాజాగా అఖిల్ కూడా ఈ మల్టీప్లెక్స్‌లో తొలిసారి అవెంజర్స్ సినిమా చూసినట్టు ట్విట్టర్‌లో వెల్లడించారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 6, 2019, 12:13 PM IST
మహేష్ బాబు తర్వాత అఖిల్ కూడా ఆ పని చేసేసాడు..
మహేష్ బాబు,అఖిల్
  • Share this:
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు..తన ఆధ్వర్యంలో ప్రారంభిమంచిన ఏఎంబీ (ఏషియన్ మహేశ్ బాబు సినిమాస్)లో తొలి సినిమా చేసాడు. మల్టీప్లెక్స్ ప్రారంభమై చాలా రోజులవుతున్న మహేశ్ బాబు మాత్రం ఇప్పటి వరకు ఈ మల్టీప్లెక్స్‌లో ఒక్క సినిమా కూడా చూడలేదు. తాజాగా హాలీవుడ్‌లో సూపర్ హిట్టైన ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ సినిమాను ఆదివారం చూసానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. థాంక్యూ ఏఎంబీ టీమ్. యూ గయ్స్ రాక్..అంటూ పేర్కొంటూ టీమ్‌తో కలిసిన ఫోటోను షేర్ చేసాడు.  ఏఎంబీ సినిమాస్‌ను మహేష్ బాబు..ఏషియన్ అధినేత సునీల్ నారంగ్‌తో కలిసి వాల్డ్ క్లాస్ హై ఎండ్ టెక్నాలజీతో నిర్మించాడు. ఈ మల్టీప్లెక్స్ ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్‌లో నిర్మించారు. హైదరాబాద్ ప్రేక్షకుల కోసం వాల్డ్ క్లాస్ టెక్నాలజీతో ఏఎంబీ సినిమాస్‌ను నిర్మించారు. మహేష్ బాబు..తను యాక్ట్ చేసిన ‘మహర్షి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ సినిమా గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ మూవీ టికెట్స్ తనకే దొరకలేదని ఒకింత చమత్కారంగా మాట్లాడారు. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

After Super Star Mahesh Babu..Akkineni Akhil watching Avengers movie in AMB Cinemas,mahesh babu,avengers endgame,mahesh babu watched avengers endgame movie in amb cinemas,mahesh babu amb cinemas,maharshi movie trailer,akhil akkineni,akhil akkineni watched avengers endgame movie,akhil twitter,mahesh babu twitter,avengers,mahesh babu funny comments on avengers endgame,mahesh babu maharshi,mahesh babu maharshi trailer,mahesh babu funny comments on avengers,mahesh babu funny comments on avengers endgame tickets in amb cinemas,mahesh babu funny comments on avengers endgame tickets,avengers end game,avengers endgame review,mahesh babu movies,mahesh babu about avengers endgame,tollywood,telugu cinema,hollywood cinema,మహేష్ బాబు,మహేష్ బాబు మహర్షి,మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్,ఏఎంబీ సినిమాస్‌లో అవెంజర్స్ సినిమా చూసిన మహేష్ బాబు,ఏఎంబీ సినిమాస్‌లో అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమా చూసిన అఖిల్,అఖిల్ అక్కినేని అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఏఎంబీ సినిమాస్,అఖిల్ అక్కినేని మహేష్ బాబు,
ఏఎంబీ సినిమాస్‌లో అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమా చూసిన మహేష్ బాబు


ఇప్పటికే మహేష్ బాబు ‘ఏఎంబీ సినిమాస్‌లో సినీ ,రాజకీయా ప్రముఖలు ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ సినిమాను చూసి ఎంజాయ్ చేసారు. అందులో ఏపీ ప్రతిపక్ష నేత ఎలక్షన్స్ తర్వాత రిలీఫ్ కోసం ఏఎంబీ సినిమాస్‌లో ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ సినిమా చూసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా అక్కినేని అఖిల్ కూడా ఏఎంబీ సినిమాస్‌లో ఫస్ట్ టైమ్ ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ సినిమా చూసానని ట్విట్టర్‌లో ట్వీట్ చేసాడు. ఒక మంచి చిత్రాన్ని మంచి థియేటర్‌లో చూసినందకు ఎంతో ఎంజాయ్ చేసానన్నారు.

ఏమైనా మహేష్ బాబుకు సంబంధించిన ‘ఏఎంబీ సినిమా’ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
First published: May 6, 2019, 12:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading