సుకుమార్ తర్వాత.. మరో క్రేజీ దర్శకుడికి ఓకే చెప్పిన అల్లు అర్జున్..

ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే బన్ని మరో క్రేజీ దర్శకుడి చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు సమాచారం.

news18-telugu
Updated: July 14, 2020, 7:49 AM IST
సుకుమార్ తర్వాత.. మరో క్రేజీ దర్శకుడికి ఓకే చెప్పిన అల్లు అర్జున్..
అల్లు అర్జున్ Photo : Twitter
  • Share this:
అల్లు అర్జున్‌ ఈ ఇయర్  త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రాన్ని తన తండ్రి అల్లు అరవింద్‌తో పాటు చినబాబు సంయుక్తంగా తెరకెక్కించారు. ఐనా.. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ పారితోషకంతో పాటు లాభాల్లో వాటా తీసుకున్నాడు. మొత్తంగా ఈ సినిమాతో అల్లు అర్జున్ ఏకంగా రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం.ఈ చిత్రం తర్వాత బన్ని.. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన  ఈ సినిమా ఫస్ట్ లుక్‌, టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్‌ కేక పెట్టిసోంది. రఫ్ అండ్ రస్టిక్‌గా ఉండి అదిరిపోయింది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌ పుష్పరాజ్ పాత్రలో  నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేసాడు దేవీశ్రీ ప్రసాద్.

after sukumar pushpa movie allu arjun will act yatra fame mahi v raghava,allu arjun,allu arjun mahi v raghava,mahi v raghava,mahi v raghava film with allu arjun,pushpa,allu arjun got huge remuneration for pushpa,allu arjun remunerationpushpa movie forest set,pushpa movie adavi set,pushpa movie forest set,pushpa movie,bobby simha,bobby simha villain charecter in allu arjun pushpa,bobby simha,allu arjun twitter,Allu Arjun pushpa twitter, Allu Arjun Pushpa, sukumars next film,allu arjun,allu arjun movies,allu arjun new movie,allu arjun latest movie,allu arjun sukumar movie,allu arjun songs,allu arjun sukumar movie launch,allu arjun sukumar movie updates,allu arjun becomes a lorry driver in sukumar movie,allu arjun sukumar new movie updates,allu arjun new song,sukumar,allu arjun as lorry driver,balakrishna lorry driver movie parts,allu arjun becomes a lorry driver, పుష్ప, అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన,బాబీ సింహా,బాబీ సింహా విలన్,అల్లు అర్జున్‌ను ఢీ కొట్టే విలన్‌గా బాబీ సింహా,:ఫారెస్ట్ సెట్,పుష్ప మూవీ కోసం ఫారెస్ట్ సెట్,అల్లు అర్జున్ పారితోషకం,అల్లు అర్జున్ భారీ  పారితోషకం,అల్లు అర్జున్ భారీ రెమ్యూనరేషన్,మహి వి రాఘవతో అల్లు అర్జున్,అల్లు అర్జున్ మహి వి రాఘవ,యాత్ర దర్శకుడితో మహి వి రాఘవ
సుకుమార్, దేవీశ్రీలతో అల్లు అర్జున్ (Twitter/Photo)


రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మరో ప్రముఖ హీరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ చేయడం లేదు. ఇప్పటి వరకు కేరళలో చిత్రీకరించాలనుకున్న ఈ చిత్రాన్ని ముందుగా అడవి సెట్ వేసి షూటింగ్ చేయాలకున్నాడు సుకుమార్. కానీ  ఇపుడు మహబూబ్ నగర్, కర్నూలులోని నల్లమల ఫారెస్ట్‌లోని లొకేషన్స్ చూసిన తర్వాత ఈ సినిమాను నల్లమలలోనే తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు సుకుమార్.ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.

యాత్ర దర్శకుడుతో మహి వి రాఘవతో అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్ (Twitter/Photo)


ఆనందో బ్రహ్మ,దివంగత ముఖ్యమంత్రి పాదయాత్ర నేపథ్యంలో  ‘యాత్ర’ సినిమాను తెరకెక్కించిన మహి. వి. రాఘవ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడట. ఇప్పటికే మహి చెప్పిన కథకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పూర్తి స్క్రిప్ట్‌తో వస్తే సినిమా చేస్తానని చెప్పాడట. దీంతో మహి పూర్తి స్క్రిప్ట్‌తో మరోసారి అల్లు అర్జున్‌ను కలిసే అవకాశాలున్నాయి. మొత్తంగా దర్శకుడిగా ఒకదానితో ఒకటి సంబంధంలేని స్టోరీలతో ప్రేక్షకులను మెప్పించిన మహి.వి.రాఘవ ఇపుడు అల్లు అర్జున్‌తో ఎలాంటి సబ్జెక్ట్‌తో మెప్పిస్తాడా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 14, 2020, 7:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading