AFTER SUKUMAR PUSHPA MOVIE ALLU ARJUN TO ACT KORATALA SIVA MOVIE HERE ARE THE DETAILS TA
మరో క్రేజీ దర్శకుడితో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ..
అల్లు అర్జున్ సినిమాకు బాలీవుడ్లో సీక్వెల్ రావడం ఏంటి.. అయినా మన హీరో తెలుగులోనే బిజీగా ఉన్నాడు కదా అనుకుంటున్నారా..? కొన్నిసార్లు అంతే.. మన దగ్గర్నుంచి కథలు తీసుకుని మనకు తెలియకుండా బాలీవుడ్లో సీక్వెల్స్ చేస్తుంటారు.
అల్లు అర్జున్ ఈ యేడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా అల్లు అర్జున్ మరో క్రేజీ దర్శకుడికి ఓకే చెప్పినట్టు సమాచారం.
అల్లు అర్జున్ ఈ యేడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటకే అల్లు అర్జున్ బర్తే సందర్భంగా విడుదలైన ఈ సినిమా లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఈ సినిమా లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియాల లెవల్లో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా అన్ని సినిమాల వలే ఆగిపోయింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్.. కొరటాల శివ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే కొరటాల శివ.. అల్లు అర్జున్ను కలిసి కథను నేరేట్ చేసాడట.
అల్లు అర్జున్, కొరటాల శివ (Twitter/Photo)
దానికి అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాను కూడా కొరటాల శివ తనదైన సామాజిక అంశానికి కమర్షియల్ విలువలు జోడించి తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ.. చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ కూడా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు షరుతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. దీంతో త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో హీరోగా నటించబోతున్నట్టు సమాచారం. కొరటాల శివ, అల్లు అర్జున్ ప్రస్తుతం వాళ్లు చేతిలో ఉన్న ప్రాజెక్టులు కంప్లీటైన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.