మహేష్‌బాబు తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండుగ. దీంతో టాలీవుడ్ హీరోలు, దర్శకులు ఈ పండుగను టార్గెట్ చేసుకుని సినిమాలను విడుదల చేస్తుంటారు. జనాలు పండుగ పూట ఖాళీగా ఉండడంతో సినిమాలు చూసే అవకాశం ఎక్కువ. దీన్నే అదునుగా తీసుకుని సినిమాలు విడుదల చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగా ఈ సంక్రాంతికి మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలై ఘన విజయం అందుకుంది. ఈ సినిమాతో పాటే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. పండగ సందర్భంగా సినిమాలు వస్తే ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. వసూళ్లు అదిరిపోయే స్థాయిలో ఉంటాయి. అందుకే మహేష్ మళ్లీ సంక్రాంతి పండగనే లక్ష్యంగా చేసుకున్నాడని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మాఫియా నేపథ్యంలో వస్తోన్న ఈ కొత్త చిత్రాన్ని వేసవిలో ప్రారంభించి సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్రబృందం.
భరత్ అనే నేను తర్వాత మహేష్ సరసన కియారా అడ్వానీ మరోసారి నటించబోతోంది. ప్రస్తుతం మహేష్ అమెరికాలో సెలవుల్ని ఆస్వాదిస్తున్నాడు. తిరిగి రాగానే కొత్త సినిమా పనులతో బిజీ కానున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh babu, Vamsi paidipally