గతేడాది ‘భరత్ అను నేను’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మహేష్ బాబు.. ఈ ఇయర్ వంశీ పైడిపల్లి దర్శత్వంలో చేసిన ‘మహర్షి’తో మరో విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ టైమ్ ఒక మిలటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే సైనికుడిగా విడుదలైన ఈ సినిమా పాటకు లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో 17 ఏళ్ల తర్వాత లేడీ సూపర్ స్టార్‌గా ఒక వెలుగు వెలిగిన విజయ శాంతి నటిగా రీ ఎంట్రీ ఇస్తోంది.
ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ఒక సినిమ ా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.
‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు (Youtube/credtit)
గతంలో ప్రశాంత్ నీల్ ఒక కథ చెప్పినా.. మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇదే కథను ఎన్టీఆర్‌తో ఓకే చేయించుకున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. రాజమౌళితో ఎన్టీఆర్ చేస్తోన్న ‘RRR’ తర్వాత ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ సినిమా పట్టాలెక్కనుంది. తాజాగా ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీ లైన్‌కు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా వచ్చే యేడాది చివర్లో పట్టాలెక్కే అవకాశం ఉంది. తొందర్లనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.