సమంత అయిపోయింది.. నెక్ట్స్ కాజల్ మిగిలింది..

Samantha Akkineni Kajal Aggarwal | అవును సమంత అయిపోయిది. ఇపుడు లైన్‌లోకి కాజల్ అగర్వాల్ వచ్చింది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: March 12, 2020, 7:12 PM IST
సమంత అయిపోయింది.. నెక్ట్స్ కాజల్ మిగిలింది..
కాజల్ అగర్వాల్, సమంత అక్కినేని Instagram
  • Share this:
అవును సమంత అయిపోయిది. ఇపుడు లైన్‌లోకి కాజల్ అగర్వాల్ వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గతేడాది సమంత.. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ‘ఓ బేబి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రం కొరియాలో హిట్టైయిన ‘మిస్ గ్రానీ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకుంది. తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ కొరియాలో హిట్టైయిన ‘డాన్సింగ్ క్వీన్’ సినిమాను   తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్ కూడా బోలేడు డబ్బులు పోసి కొనుక్కున్నాడట. తాజాగా ఈ చిత్రాన్ని కాజల్‌, అల్లరి నరేష్‌లతో రీమేక్ చేయబోతున్నాడట. ఈ మధ్యకాలంలో సురేష్ బాబు ఏ సినిమా తీసినా.. వేరే వాళ్లను నిర్మాణ భాగస్వామిగా పెట్టుకుంటున్నాడు. ఇపుడు ‘డాన్సింగ్ క్వీన్’ చిత్రం కోసం బడా కార్పోరేట్ నిర్మాణ సంస్థను భాగస్వామిగా తీసుకోవాలని చూస్తున్నాడట. జీ స్టూడియోస్,వయాకామ్, రిలయన్స్ లాంటి బడా సంస్థల్లో ఏదో ఒకదాన్ని భాగస్వామిగా చేసుకొని ఈ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నాడు. ఈ చిత్రాన్ని కూడా నందినీ రెడ్డి డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి.మొత్తానికి ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
First published: March 12, 2020, 7:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading