సినిమాలకు దూరం అవుతోన్న తారలు.. తాజాగా తమన్నా..

ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం.. దీనికి తోడు ఇంటర్నెట్ సేవలు కూడా అందరికి అనుకూల ధరల్లో ఉండడంతో ఇండియాలో డిజిటల్ మీడియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.

news18-telugu
Updated: November 30, 2019, 7:30 AM IST
సినిమాలకు దూరం అవుతోన్న తారలు.. తాజాగా తమన్నా..
Instagram
  • Share this:
దేశంలో ఎంటర్‌టైన్మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. నూతన టెక్నాలజీ అందుబాటులోకి రావడం.. దీనికి తోడు ఇంటర్నెట్, మోబైల్ స్ట్రీమింగ్ సేవలు కూడా అందరికి అనుకూల ధరల్లో ఉండడంతో ఇండియాలో డిజిటల్ మీడియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి తోడుగా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ డిజిటల్ మీడియా కంపెనీలు ఇండియా బాట పడుతున్నాయి. అందులో భాగంగా ఇండియాలో ప్రస్తుతం.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు  ప్రవేశించి చాలా ప్రాచుర్యం పొందాయి. అంతేకాదు.. ఈ సంస్థలు కేవలం హాలీవుడ్ కాంటెంట్‌ను ఇండియన్ ప్రేక్షకులపై రుద్దకుండా సొంతంగా కాంటెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటినే మనం ఒరిజనల్స్‌గా పిలుస్తున్నాము. ఈ ఒరిజనల్స్‌లో హిందీలో కియారా నుండి రాధికా ఆప్టే వరకు వెబ్ సిరీస్‌లు చేస్తూ అటూ డిజిటల్‌లో ఇటూ సినిమాల్లో మంచి అవకాశాలు పొందుతున్నారు. తెలుగులో కూడా ఇలాంటీ కల్చర్ ఇప్పుడిప్పుడే వస్తోంది.  తాజాగా  హీరోయిన్  సమంత అమెజాన్ ప్రైమ్ వెబ్‌సిరీస్‌.. ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌లో నటిస్తోంది. మరో అగ్రతార కాజల్ అగర్వాల్ కూడా వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఆసక్తి చూపినట్టు సమాచారం. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రుపొందిస్తున్న ఓ వెబ్‌సిరీస్‌లో అందాల కాజల్ నటించేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది.

తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా కూడా వెబ్‌ సిరీస్‌ల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. ‘ది నవంబర్‌ స్టోరీ’ అనే వెబ్‌ సిరీస్‌తో డిజిటల్‌లోకి ప్రవేశిస్తోంది. రామ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించనున్న ఈ వెబ్‌సిరీస్‌కు ఆనంద వికటన్‌ గ్రూప్‌ వారు నిర్మాతగా వ్యవహరించనున్నారు. అయితే సినిమాలతో పోల్చితే.. డిజిటల్‌లో కంటెంట్‌ను అనుకున్న విధంగా.. చెప్పడమే కాకుండా.. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ.. దీంతో హీరోయిన్స్ మాత్రమే కాకుండా.. ఇటు డైరెక్టర్స్ కూడా డిజిటల్ బాట పడుతున్నారు. అందులో భాగంగానే తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి.. మొదలగు వాళ్లు డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు.
GQ మ్యాగజైన్ కోసం అందాలు ఆరబోసిన కత్రీనా...First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>