Saaho: ‘సాహో’ తర్వాత ప్రభాస్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ దేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. ‘బాహుబలి’ ఇచ్చిన ఊపుతో ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేసాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ త్వరలోనే..

news18-telugu
Updated: August 18, 2019, 6:47 PM IST
Saaho: ‘సాహో’ తర్వాత ప్రభాస్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..
‘సాహో’లో ప్రభాస్ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: August 18, 2019, 6:47 PM IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ దేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. ‘బాహుబలి’ ఇచ్చిన ఊపుతో ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేసాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో  ఇంటర్నేషనల్ లెవల్‌లో ఉన్నయాక్షన్ సీన్స్ సినీ ప్రముఖులను సైతం ఆశ్యర్యపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఓ రేంజ్‌లో జరిగినట్టు సమాచారం. అఫీషియల్‌గా ప్రకటించిక పోయినా.. సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ. 330 కోట్లకు పైగా జరిగినట్టు సమాచారం. తెలంగాణ, ఏపీలో కలిపి ఈ  సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ. 125కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. సౌత్‌లో మిగిలిన భాషల్లో కలిపి రూ.46 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం. హిందీ వెర్షన్ విషయానికొస్తే.. రూ.120 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇక డిజిటల్, శాటిలైట్,ఆడియో రైట్స్ రూపంలో పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంది.



రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ దేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. ‘బాహుబలి’ ఇచ్చిన ఊపుతో ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేసాడు.
సాహో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం జరుగుతున్న ఏర్పాట్ల వద్ద 60 అడుగుల కటౌట్






 ‘సాహో’ తర్వాత ప్రభాస్.. త్వరలోనే ఒక తమిళ సినిమా చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. మంచి కథ ఉంటే డైరెక్ట్‌గా ఒక తమిళ సినిమా చేస్తానన్నారు. గతంలో ప్రభాస్.. ‘బుజ్జిగాడు’ మేడిన్ చెన్నై అంటూ ఒక సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ప్రభాస్.. రజినీకాంత్‌ ఫ్యాన్ గా అలరించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు ప్రభాస్.. డైరెక్ట్‌గా తమిళ సినిమా చేస్తా అని ప్రకటించడంతో తమిళనాడులోని ప్రభాస్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Loading...
First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...