ప్రభాస్ నెక్ట్స్ మూవీ కోసం బాహుబలి వంటి మాస్టర్ ప్లాన్..

ప్రభాస్ ఫైల్ ఫోటో twitter.com/PrabhasRaju

సాహో’ సినిమా తర్వాత ప్రభాస్..  రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా చిత్రీకరణ కోసం భారీ ప్లాన్ వేసారు.

  • Share this:
    ‘బాహుబలి’ వంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమాతో అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేకపోయినా.. కమర్షియల్‌గా మాత్రం రూ.400 కోట్లకు పైగా గ్రాస్.. రూ.250 కోట్ల షేర్‌ను రాబట్టి.. హీరోగా ప్రభాస్‌కున్న క్రేజ్‌ను తెలియజేసింది. ‘సాహో’ సినిమా తర్వాత ప్రభాస్..  రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా.  ఈ సినిమా కోసం 25 పైగా వెరైటీ సెట్స్‌ను వేస్తున్నట్టు సమాచారం. ఈ మధ్యకాలంలో ‘బాహుబలి’,‘సైరా నరసింహారెడ్డి’ వంటి సినిమాలను పక్కన పెడితే.. ఒక సోషల్ మూవీకి ఇన్ని సెట్స్ వేయలేదు.  దాదాపు రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్,యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
    First published: