HOME »NEWS »MOVIE »after rrr movie ram charan finalised another hit director here are the details ta

రామ్ చరణ్ లిస్ట్‌లో పెరిగిపోతున్న దర్శకుల లిస్ట్.. తాజాగా మరో క్రేజీ డైరెక్టర్..

రామ్ చరణ్ లిస్ట్‌లో పెరిగిపోతున్న దర్శకుల లిస్ట్.. తాజాగా మరో క్రేజీ డైరెక్టర్..
రామ్ చరణ్ న్యూ లుక్ (Ram charan new look)

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్నాడు. తాజాగా రామ్ చరణ్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ కోసం ఒక క్రేజీ దర్శకుడిని లైన్‌లో పెట్టినట్టు సమాచారం.

  • Share this:
    ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావడానికి మరో నాలుగు నెలలైనా కచ్చితంగా పట్టేలా కనిపిస్తుంది. అప్పటి వరకు మరో సినిమా గురించి ఆలోచించే టైమ్ చరణ్ దగ్గర లేదు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఇంకో హీరోగా నటిస్తున్నాడు. ఈ ఇద్దరిపై వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు జక్కన్న. ఇదిలా ఉంటే RRR సినిమా సెట్స్‌పై ఉండగానే ఇప్పుడు మరో సినిమా గురించి ఆలోచిస్తున్నాడు చరణ్. ఈయన తర్వాతి సినిమా ఏంటనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్‌ను లైన్‌లో పెట్టేసాడు. ఈయనతోనే నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు. దీనికి కళ్యాణ్ రామ్, రాధాకృష్ణ నిర్మాతలు.మరోవైపు రామ్ చరణ్ కూడా ఇప్పుడే తర్వాతి సినిమాను సెట్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఈయన కొందరు దర్శకులు చెప్పే కథలు వింటున్నాడు.

    rajamouli rrr movie may be clash with anil ravipudi f3 movie here are the details,rrr,rrr rajamouli,rrr rajamouli jr ntr ram charan,rrr vs f3,rajamouli vs anil ravipudi,rajamouli anil ravipudi,anil ravipudi mahesh babu rrr f2 sequel f3,sarileru neekevvaru,tollywood,telugu cinema,ఆర్ఆర్ఆర్,రాజమౌళి ఆర్ఆర్ఆర్,రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్,అనిల్ రావిపూడి,రాజమౌళి అనిల్ రావిపూడి,రాజమౌళి వర్సెస్ అనిల్ రావిపూడి,ఆర్ఆర్ఆర్ వర్సెస్ ఎఫ్ 3
    రాజమౌళి,అనిల్ రావిపూడి (File/Photo)




    ఐతే.. రామ్ చరణ్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను కొరటాల శివతో నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్టు సమాచారం. చిరంజీవి తర్వాత కొరటాల శివ సినిమాను దాదాపు కన్ఫామ్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, దర్శకుడు హరీష్ శంకర్, అనిల్ రావిపూడిలతో పూర్తి కమర్షియల్ ఎంటర్టేనర్ చేయబోతున్నట్టు సమాచారం. వీళ్లిద్దరి తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టేనర్ చేయబోతున్నట్టు మెగా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇంకోవైపు త్రివిక్రమ్‌తో ఒక ప్రాజెక్ట్ అనుకున్నట్టు సమాచారం. తాజాగా రామ్ చరణ్.. నానితో ‘జెర్సీ’ వంటి డిఫరెంట్ మూవీ తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక ఎమోషనల్ డ్రామాలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. మొత్తానికి ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్.. వీళ్లతో మొదటగా ఎవరితో ముందుగా సినిమా చేస్తాడనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:March 09, 2020, 07:13 IST

    टॉप स्टोरीज