ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ అనూహ్య నిర్ణయం.. ఇక నుంచి మరో లెక్క అంటున్న తారక్..

ఎన్టీఆర్ Photo : Twitter

NTR | ఇప్పటి వరకు ఒక లక్క. ఇక నుంచి మరో లెక్క అంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. వివరాల్లోకి వెళితే..  ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. 

 • Share this:
  ఇప్పటి వరకు ఒక లక్క. ఇక నుంచి మరో లెక్క అంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. వివరాల్లోకి వెళితే..  ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్కిప్ట్ వర్క్ జరుగుతోంది. కాగా గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ‘అరవింద సమేత వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా సినిమా కొంత పొలిటికల్ టచ్ ఉండనుందని టాక్. అంతేకాదు ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్‌  చినబాబుతో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో కళ్యా ణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర హీరో సంజయ్ దత్ విలన్‌గా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్, శృతి హాసన్‌ను హీరోయిన్స్‌గా అనుకుంటున్నారు.

  ntr30, sanjay dutt, ntr trivikram movie,trivikram,trivikram srinivas,jr ntr and trivikram movie updates,ntr,ntr movies,aravinda sametha movie,unior ntr and pooja hegde at trivikram movie,jr ntr and trivikram movie latest updates,jr ntr and trivikram movie title reason revealed,jr ntr and trivikram movie title,jr ntr and trivikram movie latest news,jr ntr and trivikram movie, ఎన్టీఆర్ త్రివిక్రమ్, పూజా హెగ్డే, సంజయ్ దత్
  ఎన్టీఆర్ త్రివిక్రమ్ Photo : Twitter


  ఐతే ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్.. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాను.. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ఓ తమిళ దర్శకుడి దర్శకత్వంలో ఇంకో సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పాడు. ఈ చిత్రాలన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్నాయి. ఈ సందర్భంగా ఇక నుంచి తాను చేసే ప్రతి చిత్రాన్ని అన్న కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా ఉండాలనే కండిషన్స్ పెట్టాడట. ఇక నుంచి ఎన్టీఆర్ చేసే ప్రతి చిత్రానికి కళ్యాణ్ రామ్ మరో నిర్మాతగా వ్యవహరించనున్నారు.

  మెగా ఫ్యామిలీలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్ మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. వరుసకు తామిద్దరం బాబాయి- అబ్బాయిలం అయినప్పటికీ.. అన్నాదమ్ముల్లా ఉంటామని పవన్ కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కాగా ఖుషీ వరకు పవన్, చెర్రీ దగ్గర అప్పు తీసుకునేవారట. అప్పటివరకు తీసుకున్న డబ్బును తిరిగి వెనక్కి ఇవ్వలేదట. ఈ విషయాన్ని పవన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఆ ఇంటర్వ్యూ ఇప్పటిది కాదు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిరుత చిత్రం ద్వారా రామ్ చరణ్‌ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా చేసిన పలు ప్రమోషన్లలో చరణ్‌తో పాటు చిరంజీవి, పవన్ కల్యాణ్‌, నాగబాబు పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అందులో చిరు, పవన్ గురించి మాట్లాడుతూ.. పవన్ సాధారణంగా చెర్రీ దగ్గర డబ్బులు అప్పు చేస్తూ ఉంటాడు అని అన్నారు. దానికి పవన్ స్పందిస్తూ.. 'చెర్రీ దగ్గర అప్పు చేయడానికి నేనేం ఇబ్బందిగా ఫీల్ అవ్వను. నాకు డబ్బులు కావాలనుకుంటే ఎవ్వరి దగ్గరైనా అప్పు చేస్తా. చెర్రీ దగ్గర డబ్బులు తీసుకున్న ప్రతి సారి నెక్ట్స్‌ మూవీ చేసిన తరువాత నీ అప్పును వడ్డీతో సహా తీరుస్తా అని చెబుతూ ఉంటాను. ఖుషీ వరకు చెర్రీ దగ్గర డబ్బులు తీసుకున్నా. కానీ తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు చరణ్ టాలీవుడ్‌లో స్టార్ హీరో అవుతాడు కాబట్టి, అతడికి కచ్చితంగా ఇచ్చి తీరాలి' అని అన్నారు.
  కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్


  ఇప్పటికే మహేష్ బాబు.. తన ప్రతి చిత్రాన్ని తాను కూడా ఓ భాగస్వామిగా ఉంటున్నాడు. మరోవైపు రామ్ చరణ్ కూడా చిరంజీవి చేసే ప్రతి చిత్రాన్ని కూడా తానే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ రకంగా హీరోగా ఉంటూనే నిర్మాతగా లాభాల్లో వాటా తీసుకుంటున్నారు వీళ్లు. మొన్నటి వరకు మహేష్ బాబు తన సినిమా డేట్స్ అన్ని ముందుగానే అన్నయ్య రమేష్ బాబుకు, అక్కయ్య మంజులకు కేటాయించి వాళ్లను కూడా నిర్మాణంలో భాగస్వామి చేసాడు.ఇపుడు ఎన్టీఆర్ కూడా తాను రంగంలోకి దిగకుండా.. అన్నయ్యను నిర్మాతగా రంగంలోకి దింపి నిర్మాణ భాగస్వామిగా ఉండాలని సలహా ఇస్తున్నాడు. ఈ రకంగా నిర్మాతగా కళ్యాణ్ రామ్‌కు పెద్దగా టెన్షన్స్ ఉండవు. మొత్తం షూటింగ్ సహా అన్ని వ్యవహారాలన్ని ఆయా నిర్మాతలే చూసుకుంటారు. కేవలం టైటిల్స్‌లో మాత్రమే ఆయన పేరు ఉంటుంది.  మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్.. తాను చేసే సినిమాలతో అన్నయ్య కళ్యాణ్ రామ్‌కు  ఈ  రకంగా సాయం చేయడం నిజంగానే గొప్ప విషయం.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: