ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. తెలుగు తెరపై చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు టాప్ హీరోలు కలిసి నటిస్తోన్న అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇది. ఈ చిత్రం పై తెలుగు ఇండస్ట్రీలో చాలా అంచనాలు ఉన్నాయి. పైగా బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో అంచనాలున్నాయి. ఈ సినిమాకు తెలుగులో రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరు కలిసి మరో మల్టీస్టారర్ మూవీ చేయనున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ (RRR release date)
ఐతే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేసారనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ సినిమాను టాలీవుడ్లో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న ఓ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏర్పడిన అనుబంధంతో ఈ నందమూరి, కొణిదెల హీరోలు మరో మల్టీస్టారర్ మూవీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే వీళ్లద్దరి ఇమేజ్‌కు తగ్గ మరో కథను ఓ రచయత రెడీ చేసినట్టు సమాచారం. త్వరలో ఈ మల్టీస్టారర్ పై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగులో మల్టీస్టారర్ మూవీకి ట్రెండ్ సెట్ చేసిన వీళ్లిద్దరు ఇపుడు మరో మల్టీస్టారర్‌కు శ్రీకారం చుట్టడం చూసి మెగా, నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:April 13, 2020, 19:56 IST