RRR తర్వాత ఎన్టీఆర్ ముందుగా సినిమా చేయబోయేది ఈ దర్శకుడితోనే..

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు జూనియర్ దాదాపు యేడాదన్నర పాటు డేట్స్ కేటాయించాడు.ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ ముందుగా..

news18-telugu
Updated: November 16, 2019, 12:43 PM IST
RRR తర్వాత ఎన్టీఆర్ ముందుగా సినిమా చేయబోయేది ఈ దర్శకుడితోనే..
జూనియర్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు జూనియర్ దాదాపు యేడాదన్నర పాటు డేట్స్ కేటాయించాడు. ఇక ఈ ఇయర్ తారక్ నుంచి ఎలాంటి సినిమా రావడం లేదు.  ఎన్టీఆర్ సినిమా రావాలంటే 2020 జూలై 30 వరకు వెయిట్ చేయాల్సిందే. అందుకే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఆల్రెడీ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్  నీల్‌తో పాటు తమిళ దర్శకుడు అట్లీ.. కొరటాల శివ సినిమాలకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే కదా. కానీ అనూహ్యంగా ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. ఆల్రెడీ ప్రశాంత్ నీల్.. మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. అటు కొరటాల శివ ..చిరంజీవి, ప్రభాస్ సినిమాల తర్వాత కానీ ఫ్రీ కాడు. మరోవైపు అట్లీ తమిళంలో మరో సినిమా చేస్తున్నాడు. వీళ్లు ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఎంత లేదన్నా యేడాదిన్నరకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఎన్టీఆర్ ముందుగా త్రివిక్రమ్‌తో నెక్ట్స్ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

after rrr movie jr ntr doing film with trivikram srinivas here are the details,jr ntr,jr ntr twitter,jr ntr rrr movie,jr ntr instagram,jr ntr koratala siva movie,jr ntr trivikram,jr ntr tarak trivikram srinivas,jr ntr atlee movie,jr ntr kgf director prashanth neel,jr ntr ram charan,rrr movie trailer,rrr,rrr movie teaser,rrr movie press meet,rrr movie launch,rrr movie first look,rrr movie latest updates,jr ntr new movie,rrr trailer,jr ntr movies,ntr,rrr movie news,rrr teaser,rajamouli rrr movie,rrr rajamouli movie,rrr movie updates,jr ntr about rrr movie,rrr press meet,rrr movie cast,rrr movie songs,rrr movie story,jr ntr and ram charan rrr movie,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ,జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్,జూనియర్ ఎన్టీఆర్ అట్లీ,తెలుగు సినిమా,ఎన్టీఆర్ త్రివిక్రమ్,ఎన్టీఆర్ తారక్ త్రివిక్రమ్ శ్రీనివాస్
‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ స్టిల్స్


ఆల్రెడీ త్రివిక్రమ్ శ్రీనివాస్... అల్లు అర్జున్‌తో చేస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా డిసెంబర్ మూడు వారానికి కల్ల షూటింగ్ పూర్తైవుతోంది. ఇక ఎన్టీఆర్ కూడా ‘ఆర్ఆర్ఆర్’లో తన షూటింగ్ పార్ట్ జనవరి కల్ల కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్.. ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గ కథ వినిపించడాడట. దానికి తారక్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అప్పటి వరకు త్రివిక్రమ్.. స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకొనే హడావుడిలో ఉంటాడు. ఈ సినిమా మార్చిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాను త్రివిక్రమ్ హారిని అండ్ హాసిని  క్రియేషన్ బ్యానర్‌లో తెరకెక్కించే అవకాశాలున్నాయి. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అనూహ్యంగా త్రివిక్రమ్‌తో సినిమా చేస్తుండం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత తెరకెక్కుతోన్న ఈ సినిమాతో తారక్, త్రివిక్రమ్‌లు మరో హిట్టు వాళ్ల ఖాతాలో వేసుకుంటారా లేదా అనేది చూడాలి.

First published: November 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు