AFTER RRR MOVIE JR NTR ALL SET TO WORK WITH SENSATIONAL DIRECTORS LIKE TRIVIKRAM PRASHANTH NEEL KORATALA SIVA PK
Jr NTR next movies: రాజమౌళి, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్టీఆర్ లైనప్ ఏముంది..?
ఎన్టీఆర్ (Twitter/Photo)
Jr NTR next movies: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రస్తుతం టాప్ గేర్‌లో ఉంది. ఈయన సినిమాలు గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తారక్ లైనప్ చూస్తే ఎలాంటి హీరోకైనా కుళ్లు రాక తప్పదు.
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రస్తుతం టాప్ గేర్‌లో ఉంది. ఈయన సినిమాలు గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తారక్ లైనప్ చూస్తే ఎలాంటి హీరోకైనా కుళ్లు రాక తప్పదు. ఎందుకంటే అలాంటి సినిమాలు ఇప్పుడు తారక్ చేతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈయన రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతోనే మరో ఆర్నెళ్ల పాటు బిజీగా ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. 2021, అక్టోబర్ 13న ఈ చిత్రం విడుదల కానుంది. జూనియర్ తర్వాత మూడు సినిమాలు మాత్రం అగ్ర దర్శకులతోనే ఉండబోతున్నాయి. ఇప్పటికే వరస విజయాలతో దూసుకుపోతున్న ఈయన.. RRR తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రకటన కూడా వచ్చింది. ఇదే ఏడాది సినిమా పట్టాలెక్కనుంది. హారిక హాసిని, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దాంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతుంది. ఆ మధ్య జూనియర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ ఈ విషయం కన్ఫర్మ్ చేసాడు. ప్రస్తుతం ఈయన ప్రభాస్ హీరోగా సలార్ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ఇది కూడా పాన్ ఇండియన్ లెవల్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉండబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతుంది.
రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి (RRR movie)
మరోవైపు అగ్ర దర్శకుడు కొరటాల శివ సైతం జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సంచలన విజయం సాధించింది. ఇవి మాత్రమే కాదు.. తమిళ అగ్ర దర్శకుడు అట్లీ కుమార్ కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమా కన్ఫర్మ్ చేసాడు. త్వరలోనే తెలుగు సినిమా చేయబోతున్నానని.. అది కూడా తనకిష్టమైన ఎన్టీఆర్‌తో అని చెప్పాడు అట్లీ.
జూనియర్ ఎన్టీఆర్ అట్లీ ప్రశాంత్ నీల్
ఇప్పటికే తమిళనాట వరస విజయాలతో సంచలనాలు సృష్టిస్తున్నాడు ఈ కుర్ర దర్శకుడు. అశ్వినీ దత్ బ్యానర్లోనే ఈ చిత్రం ఉండబోతుంది. కెరీర్ గ్రాప్ పడిపోకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఎందుకంటే గతంలో రాజమౌళితో సింహాద్రి, యమదొంగ లాంటి సినిమాలు చేసిన తర్వాత ఒక్కసారిగా జూనియర్ కెరీర్ అంతా డైలమాలో పడిపోయింది.
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ (Jr NTR Koratala Siva)
వరస ఫ్లాపులు ఈయన్ని బాగా ఇబ్బంది పెట్టేసాయి. అందుకే ఇప్పుడు RRR తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్, కొరటాల శివ లాంటి సంచలన దర్శకులతో పని చేయడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలు కానీ వర్కవుట్ అయితే ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోతాడు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.