తెలుగు, తమిళ చిత్రాలతో పాటు హిందీలోనూ గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఖాళీగానే ఉన్నట్లు కనిపిస్తోంది కానీ.. వచ్చే ఏడాది వరుస సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమైపోతుంది. రీసెంట్గా కరోనా పాజిటివ్ అంటూ హోం క్వారంటైన్‌లోనే గడిపిన రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు కోవిడ్ నుండి కోలుకోవడమే కాదు.. షూటింగ్‌లోనూ జాయిన్ అయ్యింది. ఇంతకీ రకుల్ ఏ సినిమా షూటింగ్లో పాల్గొందో తెలుసా?. వివరాల్లోకి వెళితే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం మేడే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.
తాను మే డే షూటింగ్లో పాల్గొన్నానని తెలియజేస్తూ రకుల్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ చిన్న వీడియోలో మేకప్ మేన్ రకుల్‌కు మేకప్ వేస్తున్నారు. ఈ వీడియోతో పాటు నేను పనిలో ఉంటేనే చాలా సంతోషంగా ఉంటాను. అంటూ రకుల్ పోస్ట్ చేసింది. మేడేలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మరి రకుల్ ఈ సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తుందో తెలియడం లేదు. కానీ.. దే దే ప్యార్ దే సినిమాలో అజయ్ దేవగణ్‌తో కలిసి నటించిన రకుల్.. అదే పరిచయంతో ఈ సినిమాలో అవకాశం దక్కించుకుంది.
2021లో నితిన్ చెక్ సినిమాతో పాటు తమిళంలో కార్తి హీరోగా రూపొందుతోన్న చిత్రం, శివకార్తికేయన్ మూవీ, ఇప్పుడు మే డే సినిమాలో నటిస్తుంది. ఇది కాకుండా వైష్ణవ్ తేజ్‌తో కలిసి క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించింది. ఇది కూడా 2021లోనే విడుదల కానుంది.