మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన తర్వాత ఒకసారి పనిచేసిన దర్శకుడితో మరోసారి పని చేయలేదు. ఇపుడు ఫస్ట్ టైమ్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్తో కలసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో రామ్ చరణ్ ..అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్.. కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్లు కంప్లీటైన ఈ సినిమా వచ్చే యేడాది జూలై 30న విడుదల కానుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరోసారి యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. చరణ్ ఇప్పటి వరకు తను పనిచేసిన దర్శకుల్లో ఫస్ట్ టైమ్ రాజమౌళితో రెండోసారి పనిచేయబోతున్నాడు. ఇపుడు అదే రూట్లో తనకు ‘ఎవడు’ వంటి మంచి సక్సెస్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో రెండోసారి పనిచేయడానికి రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం వంశీ పైడిపల్లి..మహేష్ బాబు హీరోగా ‘మహర్షి’ సినిమా చేసాడు. ఈ సినిమాను మే 9న విడుదల కానుంది. ఈ సినిమాను దిల్ రాజు, పీవీపీ,సి.అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. మొత్తానికి రామ్ చరణ్, వంశీ పైడిపల్లి సినిమాపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Maharshi, Maharshi Movie Review, Mahesh babu, Ram Charan, RRR, SS Rajamouli, Telugu Cinema, Tollywood, Vamsi paidipally