HOME »NEWS »MOVIE »after rajamouli rrr project ram charan may be work with vikram kumar direction here are the details ta

రామ్ చరణ్, విక్రమ్ కుమార్ సినిమాకు ముహూర్తం కుదిరిందా.. ?

రామ్ చరణ్, విక్రమ్ కుమార్ సినిమాకు ముహూర్తం కుదిరిందా.. ?
రామ్ చరణ్,విక్రమ్ కుమార్ (Twitter/Photo)

ప్రస్తుతం రామ్ చరణ్..హీరోగా నటిస్తూనే.. నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ వ్యవహారాలను చక్కబెడుతున్నాడు. తాజాగా రామ్ చరణ్ విక్రమ్ కుమార్‌తో నెక్ట్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

  • Share this:
    ప్రస్తుతం రామ్ చరణ్..హీరోగా నటిస్తూనే.. నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ వ్యవహారాలను చక్కబెడుతున్నాడు. రీసెంట్‌గా తండ్రి మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో ప్రొడ్యూసర్‌గా తన సత్తా ఏంటో చూపెట్టాడు.  ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఇద్దరు చారిత్రక యోధులు కలిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో రాజమౌళి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తర్వాత రామ్ చరణ్..తండ్రి చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాలో యంగ్ చిరుగా కనిపించబోతున్నట్టు సమాచారం. దాంతో పాటు సుకుమార్ దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ సినిమా రీమేక్‌లో నటించబోతున్నట్టు సమాచారం. తాజాగా రామ్  చరణ్...విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

    ram charan to work with vikram kumar direction after rajamouli rrr project,ram charan,vikram k kumar,vikram kumar,vikram kumar ram charan,ram charan instagram,ram charan facebook,ram charan twitter,ram charan,rajamouli ram charan,rrr,rajamouli,rrr rajamouli vikarm kumar,ram charan movies,ram charan speech,vikram,ram charan vijay and vikram together,ram charan vvr movie,vikram kumar,ram charan entry,ram charan in mani ratnam film,ram charan movies 2017,ram charan songs telugu,vikram k kumar hello,akhil and ram charan,ram charan new movie hindi dubbed 2019,ram charan - akhil's friendship & bonding,bollywood,tollywood,telugu cinema,రామ్ చరణ్,ఆర్ఆర్ఆర్,రాజమౌళి,విక్రమ్ కుమార్,ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ రాజమౌళి,రామ్ చరణ్ విక్రమ్ కుమార్,విక్రమ్ కుమార్ రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్
    రామ్ చరణ్,విక్రమ్ కుమార్ (Twitter/Photo)




    తెలుగులో 13బి, ఇష్క్, మనం, 24, గ్యాంగ్ లీడర్’ వంటి చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని ఏర్పరుచుకున్న విక్రమ్ కుమార్..రామ్ చరణ్ ఇమేజ్ తగ్గ ఒక డిఫరెంట్ స్టోరీ రెడీ చేసినట్టు సమాచారం. ఇప్పటికే విక్రమ్ కుమార్.. చరణ్‌ను కలిసి ఒక లైన్ వినిపించి ఓకే చేయించుకున్నట్టు సమాచారం. ఈ సినిమా విక్రమ్ కుమార్ శైలిలో డిఫరెంట్ మూవీ అని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టినరోజున మార్చి 27న అఫీషియల్ ప్రకటించే అవకాశం ఉంది. మరి మాస్ హీరో అయిన రామ్  చరణ్‌తో క్లాస్ దర్శకుడైన విక్రమ్ కుమార్ ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:February 25, 2020, 19:10 IST