news18-telugu
Updated: November 18, 2020, 2:39 PM IST
రాజమౌళి,రామ్ చరణ్ (Twitter/Photo)
Ram Charan | రామ్ చరణ్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇదే ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్.. కొమరం భీమ్ పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. ఇక చరణ్ కూడా తన కెరీర్లో ఏ దర్శకుడితో రెండోసారి పనిచేయలేదు. కానీ ‘మగధీర’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రెండోసారి యాక్ట్ చేస్తున్నాడు. ఇపుడు మరో దర్శకుడితో రెండో సారి పనిచేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. రామ్ చరణ్‌ను హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

రామ్ చరణ్,పూరీ జగన్నాథ్ (Twitter/Photo)
ఇప్పటికే పూరీ జగన్నాథ్.. రామ్ చరణ్‌ను కలిసి ఓ లైన్ చెప్పి ఓకే చేయించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్యతో ఓ సినిమా ఉంది. ఆ తర్వాత చరణ్, పూరీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. రామ్ చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంటే ముందు ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ పాత్ర మార్చి వరకు కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి. ఆ లోపు.. చరణ్.. ఆచార్యలో తన పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీట్ చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్.. చేయబోయే ప్రాజెక్ట్ ఇదే అయ్యే అవకాశం ఉంది. మరోవైపు రామ్ చరణ్.. వెంకీ కుడుములతో పాటు మరో ఇద్దరు ముగ్గురు చెప్పిన ప్రాజెక్ట్స్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం. మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ ‘ఆచార్య’ తర్వాత రామ్ చరణ్.. పూరీ జగన్నాథ్‌తోనే నెక్ట్స్ సినిమా చేస్తాడా లేదా చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 18, 2020, 2:39 PM IST