Ram Charan | రామ్ చరణ్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇదే ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్.. కొమరం భీమ్ పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. ఇక చరణ్ కూడా తన కెరీర్లో ఏ దర్శకుడితో రెండోసారి పనిచేయలేదు. కానీ ‘మగధీర’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రెండోసారి యాక్ట్ చేస్తున్నాడు. ఇపుడు మరో ఇద్దరు దర్శకులతో తన తర్వాతి సినిమాలు చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు రామ్ చరణ్. . రామ్ చరణ్‌ను హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే పూరీ జగన్నాథ్.. రామ్ చరణ్‌ను కలిసి ఓ లైన్ చెప్పి ఓకే చేయించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్యతో ఓ సినిమా ఉంది. ఆ తర్వాత చరణ్, పూరీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

రామ్ చరణ్,పూరీ జగన్నాథ్ (Twitter/Photo)
మరోవైపు రామ్ చరణ్.. వంశీ పైడిపల్లితో మరో సినిమా చేయడానికి ఓకే చెప్నినట్టు సమాచారం. ఇప్పటికే వంశీ పైడిపల్లి.. రామ్ చరన్ కాంబినేషన్లో ‘ఎవడు’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు అదే థ్రిల్లర్ తరహా కథను రామ్ చరణ్‌కు చెప్పాడట. ఈ కథ విని చెర్రీ ఇంప్రెస్ అయి.. స్టోరీ డెవలప్ చేయమని చెప్పాడట. ఇక వంశీ పైడిపల్లి కూడా ఆ కథను డెవలప్ చేసే పడ్డాడు. వంశీ పైడిపల్లి ముందుగా మహేష్ బాబుతో ఓ సినిమా అనుకున్నాడు. కానీ సడెన్‌గా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు ఓకే చేసాడు. కానీ వంశీ పైడిపల్లి మాత్రం రామ్ చరణ్ కోసం కొత్త కథను రెడీ చేసినట్టు సమాచారం.

రామ్ చరణ్ వంశీ పైడిపల్లి (Ram Charan Vamshi Paidipally)
ఇక రామ్ చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంటే ముందు ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ పాత్ర మార్చి వరకు కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి. ఆ లోపు.. చరణ్.. ఆచార్యలో తన పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీట్ చేయనున్నాడు. సంక్రాంతి తర్వాత చెర్రీ వరుసగా ఈ సినిమా కోసం మూడు వారాల డేట్స్ కేటాయించడట. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది.

కొరటాల శివ రామ్ చరణ్ (ram charan koratala siva)
ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్.. ముందుగా వంశీ పైడిపల్లి సినిమా చేసి.. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ సినిమా చేయనున్నట్టు సమాచారం. మరోవైపు రామ్ చరణ్.. వెంకీ కుడుములతో పాటు మరో ఇద్దరు ముగ్గురు చెప్పిన ప్రాజెక్ట్స్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం. మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ ‘ఆచార్య’ తర్వాత రామ్ చరణ్.. వరుస సినిమాలతో బిజీ కానున్నాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:December 05, 2020, 09:14 IST