జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు జూనియర్ దాదాపు యేడాదన్నర పాటు డేట్స్ కేటాయించాడు. ఇక ఈ ఇయర్ తారక్ నుంచి ఎలాంటి సినిమా రావడం లేదు. ఎన్టీఆర్ సినిమా రావాలంటే 2020 జూలై 30 వరకు వెయిట్ చేయాల్సిందే. అందుకే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ అదిరిపోయే రీతిలో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ముందుగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కమిటయ్యాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.

జూనియర్ ఎన్టీఆర్ అట్లీ ప్రశాంత్ నీల్
ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్లో సినిమా చేయడానికి ఆల్రెడీ ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమా అదిరిపోయే స్టోరీ, స్క్రీన్ ప్లేతో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. ఇప్పటికే అట్లీ..ఎన్టీఆర్కు స్టోరీ వినిపించి ఓకే చేయించుకున్నాడు. ఈ సినిమా కోసం అట్లీ ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాడు.

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ
ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా ఎపుడో కమిటయ్యాడు. ఈ సినిమాను కొరటాల శివ స్నేహితుడు నిర్మించనున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ ..చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. దసరా రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వచ్చే నెల మొదటి వారంలో చిరు, కొరటాల సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా పట్టాలెక్కనుంది. ఇక జూ ఎన్టీఆర్ ఈ ముగ్గురితో చేయడం కన్ఫామ్ అయింది. మరి RRR తర్వాత ఈ ముగ్గురిలో ఎవరితో ముందుగా సినిమా చేస్తాడన్నది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:October 10, 2019, 09:14 IST