సంచలన దర్శకుడితో ప్రభాస్ 22వ మూవీకి ముహూర్తం ఖరారైందా.. ?

సంచలన దర్శకుడితో ప్రభాస్ 22వ సినిమాకు ముహూర్తం ఖరారైందా. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడనుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. 

news18-telugu
Updated: August 13, 2020, 4:37 PM IST
సంచలన దర్శకుడితో ప్రభాస్ 22వ మూవీకి ముహూర్తం ఖరారైందా.. ?
ప్రభాస్ (File/Photo)
  • Share this:
సంచలన దర్శకుడితో ప్రభాస్ 22వ సినిమాకు ముహూర్తం ఖరారైందా. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడనుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.  బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేసాడు.ఈ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. అందులో ఒక్క హిందీలోనే దాదాపు రూ. 200 కోట్లను వసూలు చేయడం విశేషం. ప్రెజెంట్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో  ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది.  ఈ సినిమా తర్వాత  యంగ్ రెబల్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సోషియో ఫాంటసీ నేపథ్యంలో దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు.  ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై  ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు.  ఈ చిత్రంలో దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది.

prabhas fans afraid for deepika padukone selection due to bad sentiment,Prabhas,deepika padukone,prabhas deepika padukone,prabhas fans,Deepika Padukone, nag ashwin,prabhas,prabhas nag ashwin movie,nag ashwin about prabhas next movie heroine is deepika padukone,prabhas new movie,nag ashwin about prabhas next movie heroine,prabhas upcoming film,prabhas movie,prabhas nag ashwin movie story,nag ashwin prabhas movie,prabhas next movie,prabhas movies,nag ashwin about prabhas movie name heroine and story,deepika padukone,nag ashwin vijay devarakonda,deepika padukone,prabhas movie,prabhas action,deepika padukone prabhas,deepika padukone movies,deepika padukone new movie,baahubali prabhas,ప్రభాస్, దీపికా పదుకొనే,ప్రభాస్ దీపికా పదుకొణే,ప్రభాస్ ఫ్యాన్స్ భయపెడుతున్న దీపికా పదుకొణే
ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)


మరోవైపు ప్రభాస్.. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాణంలో డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మరో హీరోగా హృతిక్ రోషన్ నటించబోతున్నట్టు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆ సినిమా కంటే ముందు ప్రభాస్.. కేజీఎఫ్'తో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు.

prabhas and prashant neel ff
ప్రభాస్, ప్రశాంత్ నీల్ Photo : Twitter


ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. ప్రభాస్ కూడా ఈ కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. హీరోగా ప్రభాస్‌కు ఇది 22వ చిత్రం. ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో చేసే సినిమా పూర్తైయిన తర్వాత ప్రభాస్‌తో చేయబోయే సినిమా పట్టాలెక్కనుంది.ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ, నాగ్ అశ్విన్ సినిమాలు కంప్లీటైన తర్వాత 2022లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 13, 2020, 4:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading