AFTER PURI JAGANNADH JANAGANAMANA MAHESH BABU CANCELLED SUKUMAR PROJECT TA
అపుడు పూరీ జగన్నాథ్.. ఇపుడు సుకుమార్.. ఇంతకీ మహేష్ బాబు ఏం చేస్తున్నాడు..
పూరీ జగన్నాథ్, సుకుమార్‌లతో మహేష్ బాబు
తాజాగా మహేష్ బాబు..సుకుమార్‌తో చేయబోతున్న సినిమా ఆగిపోయినట్టు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు మహేష్ బాబు. అంతకు ముందు పూరీ జగన్నాథ్‌తో అనకున్న ‘జనగణమణ’ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది. ఇంతకీ మహేష్ ఈ సినిమాలను నో చెప్పడానికి కారణాలు ఏంటి ?
హీరోగా మహేష్ బాబుకు స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమాల్లో ‘పోకిరి’ ఒకటి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో మహేష్ బాబు..సూపర్ స్టార్ అయ్యాడు. ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ అప్పటి వరకు మహేష్‌ను ఎవరు చూపించని కొత్త కోణంలో చూపించి మంచి సక్సెస్ అందించాడు. ఆ తర్వాత వీరిద్దిరి కాంబినేషన్లో వచ్చిన ‘బిజినెస్ మ్యాన్’ కూడ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సూర్య భాయిగా మహేష్‌లోని విలనిజాన్ని బయటపెట్టాడు పూరీ జగన్నాథ్. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమాగా ‘జనగణమన’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఐతే ఈ సినిమా చేసే సమయానికి పూరీ జగన్నాథ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. మరోవైపు ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పూరీజగన్నాథ్ మహేష్‌ను ఒప్పించడంలో విఫలమయ్యాడు. దీంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది.
ఆగిపోయిన జనగణమణ సినిమా
తాజాగా మహేష్ బాబు..సుకుమార్‌తో చేయబోతున్న సినిమా ఆగిపోయినట్టు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు మహేష్ బాబు. ‘రంగస్థలం’ వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్..మహేష్ బాబుతో చేయబోయే సినిమా కథ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...ఫైనల్‌గా మహేష్ బాబును ఒప్పించడంలో సుకుమార్ విపలమయ్యాడు. గతంలో మహేష్..సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘నేనొక్కడినే’ సినిమా అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయినా.. సుకుమార్ దర్శకత్వ శైలి తెలిసిన మహష్ బాబు మరో అవకాశం ఇచ్చాడు.ఈ విషయంలో సుకుమార్..కథ, కథనాల విషయంలో మహేష్ బాబును సాటిస్ఫై చేయలేకపోయడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే సినిమా విషయంలో మహేష్ కథ విషయంలో సంతృప్తిగా లేడని సమాచారం. వీరి పూరీ జగన్నాథ్, సుకుమార్‌ల వలె సందీప్ రెడ్డి వంగాకు మహేష్ బాబు హ్యాండిస్తాడా లేదా అనేది చూడాలి.
సుకుమార్ మహేష్ సందీప్ రెడ్డి
మొత్తానికి నిన్నమొన్నటి వరకు కథల విషయంలో బ్లైండ్‌గా దర్శకులని నమ్మి చాలా ప్లాప్లను ఫేస్ చేసాడు మహేష్ బాబు. అందుకే ఇపుడు చేయబోయే సినిమాల విషయంలో ఒక్కసారి కమిటైన తర్వాత కూడా కథ, కథనం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే రంగంలోకి దిగాలని ఫిక్స్ అయ్యాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.