ప్రధాని మోదీని ఫాలో అవుతోన్న రజనీ.. 'మ్యాన్ వర్సెస్ వైల్డ్'‌లో..

Man Vs Wild : డిస్కవరీ చానల్‌లో ప్రసారం అయ్యే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో పాల్గొననున్న తమిళ నటుడు రజనీకాంత్.

news18-telugu
Updated: January 28, 2020, 1:52 PM IST
ప్రధాని మోదీని ఫాలో అవుతోన్న రజనీ.. 'మ్యాన్ వర్సెస్ వైల్డ్'‌లో..
Twitter
  • Share this:
డిస్కవరీ  ఛానల్‌లో ప్రసారం అయ్యే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ ప్రోగ్రామ్ యాంకర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని మోదీ చేసిన సాహాసాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాని, గ్రిల్స్.. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌కార్బెట్ నేషనల్ పార్క్‌లో సాహసయాత్రను మనోహారంగా చూపించింది డిస్కవరి ఛానల్. ఇప్పుడు ఇదే కార్యక్రమానికి తమిళ నటుడు రజనీకాంత్ హాజరుకానున్నారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ షూటింగ్ కర్నాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో జరుగనుంది. ఈ డాక్యుమెంటరీ షూటింగ్‌కు రజనీ అక్కడ రెండు రోజులుపాటు హాజరుకానున్నట్లు సమాచారం. బేర్ గ్రిల్స్, మేన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో అడవులు, నదులు, కొండల్లో తిరుగుతూ... సాహసాలు చేస్తుంటాడు. ఎలాంటి సదుపాయాలూ, ఆహారమూ లేకపోయినా అడవుల్లో, ఎడారుల్లో ఎలా బతకగలగాలో చూపిస్తుంటాడు. అందులో భాగంగా ప్రకృతిలో ఎదురయ్యే సమస్యల్ని ఎలా ఎదురించాలో వివరిస్తాడు. అందుకే ఈ షోకి మంచి ఆదరణతో పాటు అదిరిపోయే రేటింగ్ కూడా ఉంది. ఈ షోలో ఇంతకు ముందు  అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా పాల్గొని బేర్ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేశారు.Published by: Suresh Rachamalla
First published: January 28, 2020, 11:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading