Home /News /movies /

కీర్తి సురేష్ మరో రెండు సినిమాలు ఓటీటీలోనే..

కీర్తి సురేష్ మరో రెండు సినిమాలు ఓటీటీలోనే..

కీర్తి సురేష్ Photo : Twitter

కీర్తి సురేష్ Photo : Twitter

Keerthy Suresh : కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలవ్వగా.. ఆమె నటించిన మరో రెండు చిత్రాలు కూడా అదే బాటలో నడవనున్నాయని తెలుస్తోంది.

    కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా  షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. అంతేకాకుండా థియేటర్స్ కూడా మూత పడ్డాయి. ఈ లాక్ డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళా లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సీ వస్తుంది. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు పుంజుకున్నాయి. ఈ సంస్థలు కూడా ఓ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తే మంచి ఆఫర్‌ను నిర్మాత ముందుంచుతున్నారు. అందులో భాగంగా తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదలవుతున్నాయి. ఇప్పటికే తెలుగులో అమృతరామమ్ అనే సినిమా థియేటర్‌లో రిలీజ్ కాకుండా డెరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై పరువాలేదనిపించింది. ఇక అందాలతార కీర్తి సురేష్ నటించిన 'పెంగ్విన్' అనే తమిళ చిత్రం కూడా డిజిటల్ మీడియా ద్వారా  విడుదలై ఓకే అనిపించింది. ఇటీవల మరో సినిమా కృష్ణ అండ్ హిజ్ లీలా కూడా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అది అలా ఉంటే కీర్తి సురేష్ లేడి ఓరియెంటెడ్‌ సినిమాలన్ని ఓటీటీ బాట పడుతున్నాయి. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన 'పెంగ్విన్' చిత్రాన్ని లాక్ డౌన్ కారణంగా థియేటర్లలో కాకుండా, అమెజాన్ ప్రైమ్ ద్వారా జూన్ 19న విడుదల చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా అదే పేరుతో స్ట్రీమ్ అవుతోంది. ఇక్కడ మరో విశేషమేమంటే ఆమె నటించిన మరో తెలుగు చిత్రం 'మిస్ ఇండియా' నిర్మాత కూడా డిజిటల్ రిలీజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

    ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎప్రిల్ 17న విడుదల కావాల్సిఉండగా.. లాక్ డౌన్ కారణంగా విడుదలకాలేదు.  నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మించాడు.. మిస్ ఇండియాతో పాటు.. ఆమె నటించిన మరో సినిమా గుడ్ లక్ సఖి నిర్మాత కూడా ఓటీటీ రిలీజ్ కి బేరాలు మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. రేట్ ఫిక్స్ అయితే కీర్తిసురేష్ ఒటీటీ స్టార్ గా మారిపోవడం ఖాయం.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Aha OTT Platform, Amazon prime, Keerthy Suresh, Netflix, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు