మెగా అభిమానులకు డబుల్ పండుగ. ఇప్పటికే సంక్రాంతికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. వకీల్ సాబ్ సినిమా టీజర్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా టీజర్ రావడంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో గిఫ్ట్ రాబోతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆ గిఫ్ట్ అందివ్వనున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న #VT10 ఫస్ట్ లుక్ ఈనెల 19న రాబోతోంది. జనవరి 19వ తేదీ ఉదయం 10 గంటలకు వరుణ్ తేజ్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి డైరెక్టర్. గీత ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా వస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్, సింధు ముద్ద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు కూడా మ్యూజిక్ తమన్. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్‌కి చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు తమన్. తాజాగా వకీల్ సాబ్ సినిమాలో టీజర్ ట్రాక్‌కు కూడా మంచి పేరు వచ్చింది. ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా మ్యూజిక్ ఇచ్చాడు. ఈ మూవీకి జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రాఫర్.
డిసెంబర్ 29న తనకు కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు వరుణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి హోం క్వారంటైన్లో చికిత్స తీసుకున్న వరుణ్ కోలుకున్నాడు. తాజాగా, వరుణ్ తేజ్ మళ్లీ మేకప్ వేసుకున్నాడు. కొన్ని రోజులుగా క్వారంటైన్ అంటూ ఇంట్లోనే ఉండిపోయిన మెగా ప్రిన్స్ ఎట్టకేలకు పండుగకు ముందు మళ్లీ రంగేసుకున్నాడు. ఎఫ్ 3 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. క్రిస్మస్ సమయంలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. అయితే అదే సమయంలో వరుణ్ తేజ్‌తో పాటు రామ్ చరణ్ కూడా కరోనా బారిన పడ్డాడు. దాంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అయితే క్వారంటైన్ తర్వాత క్షేమంగా బయటికి వచ్చాడు వరుణ్ తేజ్. వచ్చీ రాగానే ఎఫ్ 3 షూటింగ్లో అడుగు పెట్టాడు వరుణ్.
పండుగ సమయంలో మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా అప్ డేట్స్ వస్తుండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mega Family, Tollywood Movie News, Varun Tej