ప్రియాంక చోప్రాతో సంజయ్ లీలా భన్సాలీ సంచలన చిత్రం

ఈ యేడాది ‘పద్మావత్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న భన్సాలీ...తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను కూడా ఒక బయోపిక్‌నే ఎంచుకున్నాడని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

news18-telugu
Updated: October 31, 2018, 12:24 PM IST
ప్రియాంక చోప్రాతో సంజయ్ లీలా భన్సాలీ సంచలన చిత్రం
ప్రియాంక చోప్రా, సంజయ్ లీలా భన్సాలీ
  • Share this:
బాలీవుడ్‌లో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. అలాగే బీటౌన్‌లో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీది డిఫరెంట్ స్టైల్. ముఖ్యంగా చారిత్రక చిత్రాలను తెరకెక్కించడంలో భన్సాలీకి తిరుగులేదని ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్’ సినిమాలతో నిరూపించుకున్నాడు. మరోవైపు భన్సాలీ తెరకెక్కించిన చిత్రాల్లో చరిత్రను వక్రీకరించారని కొంత మంది వాదన. వాటి సంగతి పక్కన పెడితే వెండితెరపై ఆయన తెరకెక్కించిన ఒక్కో చిత్రం ఒక్కో దృశ్యకావ్యంగా నిలిచిపోయాయి.

ఈ యేడాది ‘పద్మావత్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న భన్సాలీ...తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను కూడా ఒక బయోపిక్‌నే ఎంచుకున్నాడని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ సారి మాత్రం చారిత్రక కథాంశాల జోలికి పోకుండా...ముంబాయికి చెందిన రౌడీరాణి గంగూబాయి కోఠేవాలి జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించేందకు సంజయ్ లీలా భన్సాలీ రెడీ అవుతున్నాడు.

ముంబాయి రెడ్ లైట్ ఏరియాలో కామాటిపురా ఎంతో ఫేమస్.  ఆ ప్రాంతానికి చెందిన గంగూబాయి అంటే అక్కడివారు వణికిపోయేవారు. అంతేకాదు ఆమెను ‘మేడమ్ ఆఫ్ కామాటిపుర’గా పిలిచేవారు. చిన్నతనంలో తనకు తెలియకుండా వ్యవచార కూపంలో కూరుకు పోయిన ఆమె... ఆ తర్వాత రౌడీరాణిగా ఎదిగింది. ముంబాయిలో ఆమె నడిపిన వ్యభిచార గృహాల గురించి ఈ మూవీలో చూపించబోతున్నట్టు సమాచారం.

ఈ మూవీలో గంగూబాయిగా ప్రియాంక చోప్రా నటించబోతున్నట్టు బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే  ఈ పాత్ర చేయడానికి ప్రియాంక దాదాపు ఓకే చెప్పినట్టు సమాచారం.  ఈ మూవీకి ‘హీరా మండి’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు సంజయ్ లీలా భన్సాలీ. మొత్తానికి ‘పద్మావత్’ వంటి వివాదస్పద మూవీ తర్వాత భన్సాలీ తెరకెక్కించబోతున్న ‘హీరామండి’ మూవీ బాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

First published: October 31, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు