తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 మొదలు కావడానికి పెద్దగా టైమ్ లేదు. చూస్తుండనే సీజన్ 2 అయిపోయి కూడా అపుడే పదినెలలు కావొస్తుంది. దాంతో మూడో భాగానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే సీజన్ 3కి హోస్ట్ ఎవరు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. రోజుకో పేరు వినిపిస్తుంది కానీ బిగ్ బాస్ 3 ఎవరు అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్సే. ఓ సారి వెంకటేశ్.. మరోసారి చిరంజీవి.. ఇంకోసారి నాని, ఎన్టీఆర్ పేర్లు వినిపించాయి కానీ ఈ ముగ్గురు కాదని తేలిపోయింది. వెంకటేశ్ అయితే తనను అడిగారు కానీ చేయనని చెప్పినట్లు క్లారిటీ ఇచ్చాడు.ఇక నాని కూడా ఇప్పుడు వరస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈయన కూడా సీజన్ 3 నుంచి తప్పుకున్నట్లే. అయితే నిర్వాహకుల ఆశలు మాత్రం ఎన్టీఆర్ పైనే ఉన్నాయి. ఎలాగైనా ఆయన్నే సీజన్ 3కి ఒప్పించాలని చూస్తున్నారు. కానీ ఈయన ఇప్పుడు రాజమౌళి సినిమా చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు జూనియర్.
దర్శకధీరుడి సినిమా చేస్తూ బయట షోలు చేయడం అంటే చిన్న విషయం కాదు. బిగ్‌బాస్ 3 హోస్ట్ కోసం రాజమౌళికి రికమండేషన్ పెట్టినా వర్కౌట్ కాకపోవడంతో రేసు నుంచి ఎన్టీఆర్ పక్కకు తప్పుకున్నాడు. తాజాగా బిగ్‌బాస్ 3 రేసులోకి నాగార్జున వచ్చి చేరాడు. ఆల్రెడీ మా టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసిన ట్రాక్ రికార్డ్ నాగార్జున సొంతం. నాగ్..మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంను ఈ రేంజ్లో సక్సెస్ రక్త కట్టిస్తాడని ఎవరు అనుకోలేదు. ఆ తర్వాత చిరంజీవి ఈ ప్రోగ్రాంను హోస్ట్ చేసి విఫలమయ్యాడు.
అలా ఆయనకంటూ సెపరేట్ స్టైల్‌తో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాంను సక్సెస్ చేసినట్టే ..బిగ్‌బాస్ 3ని కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలడని మా టీవీ యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం నాగార్జున తన సొంత బ్యానర్లో మన్మథుడు 2తో పాటు బంగార్రాజు సినిమాలు చేస్తున్నాడు. ఎలాగో సొంత సినిమాలు కాబట్టి బిగ్‌బాస్ 3ప్రోగ్రాంను హోస్ట్ చేయడానికి పెద్దగా ప్రాబ్లెమ్ ఉండదు. మొత్తానికి బిగ్‌బాస్ 3 ప్రోగ్రాంను హోస్ట్ చేయడానికి మా టీవీకి నాగార్జున తప్పించి వేరే ఆప్షన్స్ ఏవి లేనట్టు కనబడుతున్నాయి. మరి మీలో ఎవరు కోటీశ్వరుడు లాగానే బిగ్‌బాస్ 3ని నాగ్ ఏ మేరకు రక్తి కట్టిస్తాడో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss, Bigg Boss 3, Chiranjeevi, Jr ntr, MAA, Nagarjuna Akkineni, Nani, Venkatesh