సంక్రాంతి దర్శకులతోనే నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ చేయనున్న బాలయ్య

సెంచరీ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత బాలకృష్ణ తన చిత్రాల విషయంలో మరింత వేగం పెంచారు. అంతేకాదు ఇపుడుతున్న యంగ్ హీరోస్ కంటే చాలా స్పీడుగా సినిమాలను అనుకున్న టైమ్‌ కంటే ముందే రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ..క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమా చేసాడు. ఈ సినిమా తర్వాత వరుసగా మూడు నాలుగు ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాడు బాలకృష్ణ.

news18-telugu
Updated: January 3, 2019, 9:00 AM IST
సంక్రాంతి దర్శకులతోనే నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ చేయనున్న బాలయ్య
బాలకృష్ణ (ఫైల్ ఫోటో)
  • Share this:
సెంచరీ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత బాలకృష్ణ తన చిత్రాల విషయంలో మరింత వేగం పెంచారు. అంతేకాదు ఇపుడుతున్న యంగ్ హీరోస్ కంటే చాలా స్పీడుగా సినిమాలను అనుకున్న టైమ్‌ కంటే ముందే రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ..క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమా చేసాడు.

ఈ చిత్రాన్ని ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ఎన్టీఆర్ మహానాయకుడు’గా రెండు పార్టులుగా తెరకెక్కించారు. ఫస్ట్ పార్ట్ కథానాయకుడు ఈ నెల 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. రెండో ప్టార్ మహానాయకుడు సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు.

‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో బాలకృష్ణ


‘ఎన్టీఆర్’ బయోపిక్ తర్వాత బాలకృష్ణ..బోయపాటి శ్రీను దర్శకత్వంలో నెక్ట్స్ సినిమాను కన్ఫామ్ చేసాడు. ఈ సినిమాకు కూడా బాలయ్యే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తర్వాత వినాయక్ దర్శకత్వంలో ఒక మూవీ చేయడానికి ఓకే చెప్పాడు.VV Vinayak palanning a movie with Venkatesh.. Balakrishna movie in Hold.. అవును.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే జ‌రుగుతుంది. ఓ అగ్ర ద‌ర్శ‌కున్ని కొన్ని రోజులుగా బాల‌య్య వెంట తిప్పించుకుంటున్నాడు. సినిమా క‌న్ఫ‌ర్మ్ అయిన త‌ర్వాత కూడా ఎటూ తేల్చ‌డం లేదు. దాంతో ఇప్పుడు ద‌ర్శ‌కుడే మ‌న‌సు మార్చుకుని వెంక‌టేష్ ద‌గ్గ‌రికి వ‌చ్చేసాడు. ఆయ‌న ఎవ‌రో కాదు.. వినాయ‌క్. ఈయ‌న ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. బాలయ్య స్థానంలోకి వెంకీ వచ్చేసాడు. vv vinayak balakrishna movie,vv vinayak venkatesh movie,vv vinayak movies,vv vinayak balakrishna venkatesh,balakrishna vv vinayak new movie,vinayak venkatesh,telugu cinema,వినాయక్, వినాయక్ బాలకృష్ణ,వినాయక్ వెంకటేష్,వినాయక్ తెలుగు సినిమా,వినాయక్ మూవీస్,వినాయక్ బాలయ్య వెంకటేష్, వినాయక్ వెంకటేష్ లక్ష్మీ ,తెలుగు సినిమా
వినాయక్ బాలయ్య


వీటితో పాటు అనిల్ రావిపూడితో ఒక సినిమాను కన్ఫామ్ చేశాడు. ఈ ఇయర్ లాస్ట్‌లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. వీటి తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ మూవీ చేయబోతున్నట్టు బాలయ్య సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ..చిరంజీవితో ఒక సినిమా చేయనున్నట్టు గట్టిగా ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ సినిమా తర్వాత బాలయ్య, కొరటాల శివ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఈ సినిమాను సమకాలీన రాజకీయ అంశాలతో తెరకెక్కించనున్నట్టు సమాచారం. మొత్తానికి ఈ సంక్రాంతికి బాలయ్య హీరోగా నటించిన ‘ఎన్టీఆర్..కథానాయకుడు’ కు పోటీగా రిలీజవుతున్న సినిమాల దర్శకులతోనే నెక్ట్స్ ప్రాజెక్ట్‌లను ఓకే చేయడం పెద్ద విచిత్రమనే చెప్పాలి.

సుబ్ర అయ్యప్ప హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్

ఇవి కూడా చదవండి 

చ‌రిత్ర సృష్టించిన ఎన్టీఆర్ బ‌యోపిక్.. రైట్స్‌తోనే బ‌డ్జెట్ వెన‌క్కి..

రాసి పెట్టుకోండి.. నంద‌మూరి మోక్ష‌జ్ఞ తొలి ద‌ర్శ‌కుడు ఆయ‌నే..

‘మ‌హానాయ‌కుడు’ Vs ‘యాత్ర‌’.. వైసీపీ Vs టీడీపీ..
First published: January 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>