నిహారిక పెళ్లి తర్వాత వెంటనే వరుణ్ తేజ్.. నాగబాబు క్లారిటీ..

వరుణ్ తేజ్ నిహారిక (varun tej niharika)

Niharika Marriage: త‌న కుటుంబంలో ఇప్పుడు రెండు పెళ్లిళ్ళు బాకీ ఉన్నాయంటున్నాడు నాగబాబు. ఒక‌టి కొడుకు వ‌రుణ్ తేజ్ అయితే మ‌రోటి కూతురు నిహారికది.

  • Share this:
ఈ మ‌ధ్య కాలంలో వ‌ర‌స‌గా వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల్లో ఉన్నాడు నాగ‌బాబు. ఈయ‌న మాట్లాడితే చాలు కాంట్ర‌వ‌ర్సీలు ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చేస్తున్నాయి. యూ ట్యూబ్ ఛానెల్లో ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తాడో అర్థం కావడం లేదు. ఇలాంటి స‌మ‌యంలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పాడు మెగా బ్ర‌ద‌ర్. త‌న కుటుంబంలో ఇప్పుడు రెండు పెళ్లిళ్ళు బాకీ ఉన్నాయంటున్నాడు ఈయ‌న‌. ఒక‌టి కొడుకు వ‌రుణ్ తేజ్ అయితే మ‌రోటి కూతురు నిహారికది. ఇప్పటికే నిహారిక పెళ్లి కన్ఫర్మ్ అయిపోయింది. చైతన్య జొన్నలగడ్డతో ఈమె పెళ్లి ఫిక్స్ అయింది. డిసెంబర్‌లో పెళ్లి జరిగే అవకాశాలున్నాయి.

నాగబాబు వరుణ్ తేజ్ (naga babu varun)
నాగబాబు వరుణ్ తేజ్ (naga babu varun)


నిహారిక పెళ్లి ఖాయం కావడంతో వరుణ్ తేజ్ పెళ్లిపై కూడా స్పందించాడు నాగబాబు. చాలా రోజుల నుంచి తాను వ‌రుణ్ తేజ్‌కు పెళ్లి చేసుకోవాల‌ని చెబుతున్న‌ట్లు చెప్పాడు ఈ న‌టుడు. అయితే ఇప్పుడు జీవితంలో సెటిల్ కాకుండా పెళ్లి చేసుకోవ‌డం క‌ష్టం.. ఇంకా సెటిల్ అవ్వాలి.. సంపాదించాలంటూ ఈ త‌రం కుర్రాళ్లంతా చెబుతున్న‌ట్లే చెప్తున్నాడ‌ని చెప్పాడు నాగ‌బాబు. పైగా త‌న‌కంటే ఎక్కువ‌గా సంపాదిస్తున్నాడు కదా.. ఇప్పుడు మాట కూడా విన‌డం లేదంటూ చ‌మత్క‌రించాడు మెగా బ్ర‌ద‌ర్.

వరుణ్ తేజ్ (Photo/ Varun Tej Twitter)
వరుణ్ తేజ్ (Photo/ Varun Tej Twitter)


వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం బాక్సర్ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు. ఈయ‌న పెళ్లితో పాటు నిహారిక పెళ్లిపై కూడా స్పందించాడు నాగ‌బాబు. చైతన్య చాలా మంచి కుర్రాడని.. తమ కుటుంబానికి కూడా చాలా కాలంగా తెలుసు అంటున్నాడు. 2020 చివర్లోనే ఈమె పెళ్లి పీటలెక్కబోతుంది. కరోనా లేకపోయుంటే ఈ పెళ్లి ఇంకా త్వరగా జరిగేది కూడా. నిహా సినిమాల్లోకి వ‌చ్చేట‌ప్పుడే అవ‌స‌ర‌మా అని అడిగాన‌ని.. క‌చ్చితంగా న‌టిస్తాన‌ని మొండికేయ‌డంతో కాద‌న‌లేక‌పోయానంటున్నాడు మెగా బ్ర‌ద‌ర్.

నిహారిక పెళ్లిపై స్పందించిన నాగబాబు (Twitter/Photo)
నిహారిక పెళ్లిపై స్పందించిన నాగబాబు (Twitter/Photo)


వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తుంటే ఓకే చెప్పానంటున్నాడు నాగ‌బాబు. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా చేయదా అనేది కూడా పూర్తిగా నిహారిక నిర్ణయమే. ఆమె చేస్తానంటే కాదనే వాళ్లు లేరు.. ఒకవేళ మానేస్తానంటే కూడా వద్దనే వాళ్లు కూడా లేరు. పూర్తిగా తన స్వంతత్య్ర నిర్ణయం అంటున్నారు కుటుంబ సభ్యులు కూడా. మొత్తానికి పిల్లల పెళ్లిళ్లు అయిపోతే తాను ఫ్రీ అయిపోతానంటున్నాడు ఈయన.
Published by:Praveen Kumar Vadla
First published: