హోమ్ /వార్తలు /సినిమా /

Boyapati Srinu: అఖండ తర్వాత మరోసారి నందమూరి హీరోతో బోయపాటి శ్రీను క్రేజీ ప్రాజెక్ట్..

Boyapati Srinu: అఖండ తర్వాత మరోసారి నందమూరి హీరోతో బోయపాటి శ్రీను క్రేజీ ప్రాజెక్ట్..

బోయపాటి శ్రీను (File/Photo)

బోయపాటి శ్రీను (File/Photo)

Boyapati Srinu: బోయపాటి శ్రీను .. బాలయ్యతో ‘అఖండ’ తర్వాత మరోసారి నందమూరి హీరోతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం

  Boyapati Srinu: ప్రస్తుతం బోయపాటి శ్రీను.. నందమూరి బాలకృష్ణతో ‘అఖండ’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఉగాది సందర్బంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు టీజర్ విడుదల చేసారు. ఈ సినిమా టీజర్‌కు యూట్యూబ్‌లో ట్రెమెండెస్ రెస్పాన్స్ వస్తోంది. కాలు దువ్వే నంది ముందు.. రంగు మార్చే పంది  అంటూ బాలయ్య చెప్పిన ఒక్క  డైలాగుతో ఈ సినిమా రేంజ్ ఏంటనేది బోయపాటి చెప్పకనే చెప్పేసాడు. అంతేకాదు సీనియర్ హీరోల్లో అతి తక్కువ టైమ్‌లో ఎక్కువ వ్యూస్ దక్కించుకున్న సినిమా టీజర్‌గా ‘అఖండ’ కొత్త రికార్డులను నెలకొల్పింది. విడుదలై వారం కాకుండానే ఈ సినిమా 23 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా క్లైమాక్స్ కర్ణాటకతో పాటు.. తెలంగాణలోని వికారాబాద్ అడవుల్లో షూట్ చేస్తున్నారు.

  ఆ సంగతి పక్కన పెడితే.. బోయపాటి శ్రీను .. బాలయ్యతో ‘అఖండ’ తర్వాత మరోసారి నందమూరి హీరోతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్‌తో తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే కళ్యాణ్‌ రామ్‌కు కథ వినిపించిన బోయపాటి శ్రీను ఓకే చేయించుకున్నాడు. గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న కళ్యాణ్‌ రామ్‌కు బోయపాటి శ్రీను వంటి మాస్ దర్శకుడుతో సినిమా చేస్తే అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అందుకే వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను బోయపాటి శ్రీనుతో చేయడానిక రెడీ అయ్యాడు.

  కళ్యాణ్ రామ్, బోయపాటి శ్రీను (File/Photo)

  ఇప్పటికే కళ్యాణ్ రామ్.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు నవీన్ మేడారం అనే దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాల షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కానీకి వచ్చాయి. ఇపుడు బోయపాటి శ్రీనుతో పవర్‌ఫుల్ మాస్ సబ్జెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మొత్తంగా బోయపాటి శ్రీను.. బాలయ్య, ఎన్టీఆర్ తర్వాత ఇపుడు మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌తో తనదైన మార్క్ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే బోయే సినిమాపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Akhanda, Balakrishna, Boyapati Srinu, Kalyan Ram Nandamuri, NBK, Tollywood

  ఉత్తమ కథలు