news18-telugu
Updated: October 27, 2019, 5:49 PM IST
Instagram
Keerthy Suresh : కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న అగ్ర హీరోయిన్స్‌లలో ఒకరుగా రాణిస్తున్నారు. తెలుగు సినిమా 'మహానటి'తో స్టార్ స్టేటస్‌తో పాటు సూపర్ క్రేజ్ సంపాదించుకుంది కీర్తి. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేసింది. మహానటిలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోవడమే కాదు.. కీర్తికి జాతీయ పురస్కారం కూడ లభించింది. కాగా 'నేను శైలజ' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన కీర్తి సురేష్ వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 'మహానటి'కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న కీర్తి, ఆ తర్వాత మంచి నటిగా రాణిస్తూ.. కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది.
అది అలా ఉంటే కీర్తికి రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘సిరుతై’ శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించనున్న కొత్త చిత్రంలో ఈ భామకు రజనీ సరసన నటించే అవకాశం ఉంది. అలాగే కార్తీ ఖైదీ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలోనూ కీర్తిసురేష్ నటించే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు ఓకే అయితే రజనీకాంత్, విజయ్ చిత్రాల్లో ఒకేసారి నటించిన భామల్లో నయనతార తరువాత కీర్తిసురేష్ ఆ రికార్డ్‌ను తన బుట్టలో వేసుకోనుంది. నయనతార ఓ పక్క విజయ్ ‘బిగిల్’ చిత్రంలో నటిస్తూనే.. రజనీకాంత్ ‘దర్బార్’లోనూ హీరోయిన్గా నటించింది.
కీర్తీ సురేష్ అదిరిపోయే పిక్స్..
Published by:
Suresh Rachamalla
First published:
October 27, 2019, 5:44 PM IST