హోమ్ /వార్తలు /సినిమా /

Namrata Shirodkar: నమ్రత శిరోద్కర్ తర్వాత ఎవరు.. డ్రగ్స్ కేసులో తెరపైకి ఆ హీరోయిన్ పేరు..

Namrata Shirodkar: నమ్రత శిరోద్కర్ తర్వాత ఎవరు.. డ్రగ్స్ కేసులో తెరపైకి ఆ హీరోయిన్ పేరు..

నమ్రత శిరోద్కర్: వంశీ

నమ్రత శిరోద్కర్: వంశీ

Namrata Shirodkar: బాలీవుడ్‌లో కదిలిన డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వరకు వచ్చింది. ఇక్కడ కూడా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పేరు బయటికి వచ్చింది.

బాలీవుడ్‌లో కదిలిన డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వరకు వచ్చింది. ఇక్కడ కూడా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పేరు బయటికి వచ్చింది. ఈమెకు డ్రగ్స్ సప్లై చేసినట్లుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ జయ సాహా వాంగ్మూలం ఇచ్చింది. దాంతో ఈమె పేరు జాతీయ మీడియాలో వచ్చింది. అయితే ఇది నమ్రత పేరుతో మాత్రమే ఆగిపోయేలా కనిపించడం లేదు. కచ్చితంగా ఇంకా చాలా మంది పేర్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. అసలే ఇప్పుడు బాలీవుడ్‌ను డ్రగ్స్ కేసు కుదిపేస్తుంది.

జైలుకు రియా చక్రవర్తి (rhea chakraborty)
రియా చక్రవర్తి (Twitter/rhea chakraborty)

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరిగి ఇక్కడకి వచ్చి ఆగింది. ముఖ్యంగా చాలా మంది హీరోయిన్ల పేర్లు ఇందులో బయటికి వస్తుండటం సంచలనంగా మారుతుంది. ఇప్పటికే రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ అధికారులు జైల్లో ఉంచారు. ఆ తర్వాత రకుల్, సారా, శ్రద్ధా కపూర్ పేర్లు కూడా ఇందులో వినిపిస్తున్నాయి. ఇక తాజాగా మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు బయటికి వచ్చింది. ఈమె తర్వాత మరికొందరి పేర్లు కూడా బయటికి వచ్చేలా కనిపిస్తుంది.

మహేష్ బాబు నమ్రత (mahesh babu namrata)
మహేష్ బాబు నమ్రత (mahesh babu namrata)

తాజాగా ఈ కేసులో బాలీవుడ్ నటి దియా మీర్జా పేరు తెరపైకి వచ్చింది. ఈమెకు కూడా త్వరలోనే సమన్లు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. 2019లో దియా డ్రగ్స్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి నార్కోటిక్స్ అధికారుల దగ్గర సమాచారం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దియాకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు డ్రగ్ డీలర్స్ పోలీసు విచారణలో అంగీకరించినట్లు ప్రచారం జరుగుతుంది.

దియా మీర్జా డ్రగ్స్ కేసు (dia mirza)
దియా మీర్జా డ్రగ్స్ కేసు (dia mirza)

దియా మీర్జాతో పాటు మరికొందరి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అంతేకాదు నమ్రతతో పాటు టాలీవుడ్‌లో మరికొందరి పేర్లు కూడా అక్కడ ముంబైలో చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. మరి అవి కూడా బయటికి వస్తే మరెన్ని సంచలనాలు బయటికి వస్తాయో..? రెండేళ్ల కింద కూడా టాలీవుడ్‌ను డ్రగ్స్ రాకెట్ ఊపేసింది. అప్పుడు పూరీ, ఛార్మి, రవితేజ సహా ఇంకా చాలా మంది విచారణకు హాజరయ్యారు. మరిప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Namrata, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు