నాగబాబు తప్పుకోవడంతో జబర్ధస్త్‌ షోలో రోజా పంట పండిందిగా..

నాగబాబు.. జబర్ధస్త్ షో నుండి తప్పుకోవడంతో ఎమ్మెల్యే రోజా ఒక్కరే ఈ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నాగబాబు తప్పుకోవడంతో రోజాకు పంట పండింది.

news18-telugu
Updated: December 2, 2019, 8:11 AM IST
నాగబాబు తప్పుకోవడంతో జబర్ధస్త్‌ షోలో రోజా పంట పండిందిగా..
‘జబర్దస్త్’ షో నాగబాబు, రోజా
  • Share this:
జబర్ధస్త్ కామెడీ షో నుంచి బయటకు వచ్చేసి.. జీ తెలుగులో ప్రసారమయ్యే ‘లోకల్ గ్యాంగ్స్‌‌’ ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు నాగబాబు. ఇక నాగబాబు.. జబర్ధస్త్ షో నుండి తప్పుకోవడంతో ఎమ్మెల్యే రోజా ఒక్కరే ఈ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. మధ్యలో ఎవరైనా తమ సినిమా ప్రమోషన్ కోసం ఈ షోకు వస్తే.. ఆయా హీరోలు.. నాగబాబు సీట్లో కూర్చుంటున్నారు. ఈ వారం 90 ఎంఎల్ హీరో కార్తికేయ జబర్ధస్త్ జడ్జ్‌గా వ్యవహరించారు. జబర్థస్త్ షో నుంచి నాగబాబు పక్కకు తప్పుకోవడంతో జడ్జ్‌గా వ్యవహరిస్తున్న రోజాకు.. ఈ షో నిర్వాహకులు ఇంతకు ముందు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఎక్కువ పారితోషకం ఇస్తున్నట్టు సమాచారం.  జబర్ధస్త్ షోలో ఒక్కో ఎపిసోడ్‌‌కు రోజా రూ.1.5 లక్షల తీసుకొనేది. కానీ రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత  నుంచి రూ.2 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం.తాజాగా మల్లెమాల వాళ్లు నాగబాబు పక్కకు తప్పుకోవడంతో.. రోజా మరేదైనా షో కారణంగా ఈ ప్రోగ్రామ్ నుంచి పక్కకు తప్పుకుంటుందనే అనుమానాలతో ఆమె పారితోషకాన్ని  మరో రూ.లక్ష వరకు పెంచినట్టు సమచారం.

RK Roja,Jain Handloom Exhibition in Vijayawada,RK Roja in Vijayawada,APIIC Chairperson RK Roja,ఆర్కే రోజా సెల్వమణి,విజయవాడ జైన్ ఎగ్జిబిషన్,విజయవాడ,ఏపీఐఐసీ,
ఆర్కే రోజా సెల్వమణి


ఇక ఏపీఐఐసీ ఛైర్మన్‌గా రోజాకు నెలకు రూ.3.82 లక్షల జీతభత్యాలు అందుకుంటోంది. ఇక ఎమ్మెల్యేగా వచ్చే జీతం అదనం. జబర్దస్త్ షో నుంచి అందుకునే పారితోషకం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ రకంగా రోజా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు.. రెండు చేతులు కాదు... నాలుగు చేతులు బాగానే సంపాదించుకుంటుంది.

First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>