రీల్ లైఫ్‌లో నిజమైన భార్యా భర్తలుగా రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణే..

బాలీవుడ్ హాట్ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణేల గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘రామ్ లీలా’, ‘బాజీ రావ్ మస్తానీ’ వంటి సినిమాలతో వెండితెరపై తమ అద్భుతమైన నటనతో కెమిస్ట్రీ పండించారు. పెళ్లి తర్వాత ఎవరికి వాళ్లు సినిమాలతో బిజీగా ఉన్న వీళ్లిద్దరు ఇపుడు 1983 భారత్  క్రికెట్‌లో ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘83’ బయోపిక్‌లో జంటగా నటిస్తున్నారు.

news18-telugu
Updated: June 12, 2019, 11:17 AM IST
రీల్ లైఫ్‌లో నిజమైన భార్యా భర్తలుగా రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణే..
83 బయోపిక్‌లో జంటగా నటిస్తోన్న రణ్‌వీర్ సింగ్,దీపికా పదుకొణే
  • Share this:
బాలీవుడ్ హాట్ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణేల గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘రామ్ లీలా’, ‘బాజీ రావ్ మస్తానీ’ వంటి సినిమాలతో వెండితెరపై తమ అద్భుతమైన నటనతో కెమిస్ట్రీ పండించారు. మరోవైపు ‘పద్మావత్’ సినిమాలో వీళ్లిద్దరు నటించినా జంటగా మాత్రం నటించలేదు. అంతేకాదు ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు కూాడా లేవు. ఆ తర్వాత వీళ్లిద్దరు  నిజ జీవితంలో పెళ్లితో ఒకింటి వాళ్లైయ్యారు. పెళ్లి తర్వాత ఎవరికి వాళ్లు సినిమాలతో బిజీగా ఉన్న వీళ్లిద్దరు ఇపుడు 1983 భారత్  క్రికెట్‌లో ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘83’ బయోపిక్‌లో జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్  కపిల్ దేవ్ పాత్రలో నటిస్తుండగా..ఆయన భార్య రోమి భాటియా పాత్రలో దీపికా పదుకొణే యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెళ్లి తర్వాత రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణే ఈ సినిమాలోనే జంటగా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. క్రికెట్ కోసం జీవితాన్ని అంకితం చేసిన కపిల్‌కు వ్యక్తిగత జీవితంలో అండగా నిలిచిన ఆయన విజయంలో తన వంతు సాయం చేసిన రోమి భాటియా పాత్రకు మంచి స్కోప్ ఉంది. అందుకే ఈ సినిమాలో ఆ పాత్ర కోసం దీపికాను తీసుకున్నారు.ప్రస్తుతం దీపికా హీరోయిన్‌గా నటించిన ‘ఛపాక్’ సినిమా షూటింగ్ కంప్లీటైంది. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. 
First published: June 12, 2019, 11:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading