పెళ్లి తర్వాత రణ్వీర్ సింగ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతేకాదు ‘సింబా’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇపుడు ‘గల్లీబాయ్’గా తన లక్‌ను పరీక్షించుకున్నాడు.
కానీ వివాహం తర్వాత దీపికా పదుకొణే..ఇప్పటి వరకు సినిమా షూటింగ్ చేయలేదు. పెళ్లి తర్వాత దీపికా..విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో లేడీ డాన్ స్వప్నా దీదీ క్యారెక్టర్ చేయడానికి దీపికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఈ చిత్రం మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తోన్న ఇర్ఫార్ ఖాన్..అనారోగ్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.
ప్రస్తుతం దీపికా ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ దర్శకత్వంలో .. 32 ఏళ్ల యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ పాత్రలో నటించడానికిీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఒక వ్యక్తి కారణంగా చితికిపోయిన ఓ మహిళ జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ మూవీకి దీపికా నిర్మాతగా వ్యవహరిస్తోంది.
తాజాగా ‘ఛపాక్’ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఈ చిత్ర దర్శకురాలు మేఘనా గుల్జార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పసుపు రంగు చున్నీ ఫోటోను షేర్ చేస్తూ చెప్పింది.
ఈ చున్నీ అక్కడక్కడా కాలిపోయినట్లు ఉంది. ఈ ప్రదేశంలో అక్కడక్కడా యాసిడ్ దాడి మరకలు కనిపిస్తున్నాయి.
2005లో లక్ష్మి దిల్లిలోని ఓ బస్టాప్‌లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకోలేదున్న ఒకే ఒక్క కారణంతో ఆమెపై యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దాడి జరిగిన తర్వాత సుప్రీంకోర్టులో యాసిడ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రస్తుతం ఆమె యాసిడ్ దాడి బాధితుల సంఘానికి అధ్యక్షరాలుగా పనిచేస్తోంది. మొత్తానికి పెళ్లైన చాలా రోజులకు దీపికా..సినిమా షూటింగులతో బిజీ కాబోతుంది.
బాలీవుడ్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు
ఇవి కూడా చదవండి
‘ఎన్టీఆర్ కథానాయకుడు’, వైయస్ఆర్ ‘యాత్ర’ ఆ విషయంలో దొందూ దొందే...
బాలకృష్ణ మొదలు పెట్టాడు... రామ్ గోపాల్ వర్మ ఫినిష్ చేస్తున్నాడు...
40 ఏళ్ళ హీరోతో 20 ఏళ్ల హీరోయిన్ పెళ్లి.. తమిళనాట తాజా సంచలనం..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Deepika Padukone, Hindi Cinema, Ranveer Singh