విడాకుల దిశగా మరో టాలీవుడ్ జంట.. అమ్మాయి స్టార్ హీరో కూతురు..?

సినిమా ఇండస్ట్రీలో బంధాలు నీటిమీద రాతల్లాగే ఉంటాయి. కొన్ని జంటలు బలంగా ఉన్నా కూడా కొందరు మాత్రం చాలా వీక్. వాళ్లలో వాళ్లకు కుదరక.. పొత్తు పడక.. అభిప్రాయాలు కలవక పెళ్లైన తర్వాత..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 6, 2019, 9:28 PM IST
విడాకుల దిశగా మరో టాలీవుడ్ జంట.. అమ్మాయి స్టార్ హీరో కూతురు..?
తెలుగు ఇండస్ట్రీలో మరో విడాకులు
  • Share this:
సినిమా ఇండస్ట్రీలో బంధాలు నీటిమీద రాతల్లాగే ఉంటాయి. కొన్ని జంటలు బలంగా ఉన్నా కూడా కొందరు మాత్రం చాలా వీక్. వాళ్లలో వాళ్లకు కుదరక.. పొత్తు పడక.. అభిప్రాయాలు కలవక పెళ్లైన తర్వాత విడిపోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటారు. మొన్నటికి మొన్న మంచు మనోజ్ తన భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చాడు. ఇది నిజంగానే ఓ సంచలనం. పెళ్లై పట్టుమని మూడేళ్లు కూడా కాకుండానే భార్యాభర్తలు విడిపోవడం నిజంగానే విషాదం. ఈ విషయంలో మంచు అభిమానులు కూడా చాలా బాధ పడ్డారు. కారణమేదైనా కూడా ఇద్దరూ విడిపోవడం అనేది దారుణం.

భార్య ప్రణతితో మంచు మనోజ్


ఇక దానికంటే ముందు నిశ్చితార్థం తర్వాత అఖిల్ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ ముందు కూడా చాలా మంది సెలెబ్రిటీస్ ఇలా తమ పెళ్లి బంధాన్ని వద్దనుకుని చట్ట ప్రకారం విడిపోయారు. ఇక ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మరో జంట కూడా విడాకుల బాట పడుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఓ పెద్దింటి అమ్మాయికే ఇప్పుడు ఈ తిప్పలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ బిజినెస్ మ్యాన్‌తో కొన్నేళ్ల కింద ఆ అమ్మాయికి పెళ్లి జరిగిందని.. అయితే ఇప్పుడు వాళ్ల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవడానికి సిద్ధమయ్యారనే వార్తలు జోరుగానే వినిపిస్తున్నాయి.

తెలుగు ఇండస్ట్రీలో మరో విడాకులు
ఆ బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకున్నది ఓ పెద్ద హీరో కూతురునే అని.. అబ్బాయి తరఫు వాళ్లు తమకు ఇబ్బందులున్నాయని చెబుతున్నా కూడా అమ్మాయి వర్గం అంటీ ముట్టనట్లుగా ఉన్నారని తెలుస్తుంది. దాంతో కలిసుండటం కంటే విడిపోవడమే నయమని ఫిక్సైపోయి.. ఈ జంట విడాకులకు సిద్ధమయ్యారని ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్న వార్తలు. వీళ్ల విడాకుల గురించి త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా బయటికి రానుంది. పెద్దింటి అమ్మాయి.. బిజినెస్ మ్యాన్ అంటే ఆ జంట ఎవరో కాస్త ఆలోచిస్తే ఇట్టే అర్థమైపోతుంది.
First published: October 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు