శివ నిర్వాణ ఇపుడు టాలీవుడ్లో మారు మోగుతున్న పేరు. మజిలీ సక్సెస్‌తో దర్శకుడిగా రెండో సక్సెస్ అందుకొని టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారాడు. అంతకు ముందు దర్శకుడిగా తిసిన మొదటి సినిమా ‘నిన్నుకోరి’ కూడా ఎమోషనల్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కించి మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా నాగ చైతన్య, సమంతతో చేసిన ‘మజిలీ’ సినిమాతో ద్వితీయ విఘ్నాన్ని అధిగమించాడు. ఈ సినిమా ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాట పట్టింది.
నాగ చైతన్య, సమంతతో శివ నిర్వాణ
ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ..విజయ్ దేవరకొండతో నెక్ట్స్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఇప్పటికే కథా చర్చలు కూడా నడుస్తున్నాయి. విజయ్ దేవరకొండతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఒక యూత్‌ఫుల్ లవ్ స్టోరీ తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నాడు. మొత్తానికి మజిలీ సక్సెస్‌తో శివ నిర్వాణకు టాలీవుడ్లో డిమాండ్ పెరిగింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.