AFTER MAHESH BABU SARILERU NEEKEVVARU MOVIE VIJAYASHANTI MAY ACT ANIL RAVIPUDI F3 SEQUEL TA
అనిల్ రావిపూడి అదిరిపోయే ప్లాన్.. ఆ సినిమా సీక్వెల్లో విజయ శాంతి..
‘సరిలేరు నీకెవ్వరు’ సెట్లో మహేష్,విజయశాంతి, ప్రకాష్ రాజ్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి (Twitter/Photo)
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. అదే కోవలో దర్శకుడు అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ సీక్వెల్ పట్టాలెక్కించే పనిలో పట్టాడు. తాజాగా ఎఫ్ 3 సీక్వెల్ లో విజయ శాంతి ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. కొత్త కథలన్న.. హిట్టైన స్టోరీలకు కొంచెం అటూ ఇటూ స్టోరీ, స్క్రీన్ ప్లే రాసుకుంటే సీక్వెల్ రెడీ. ఈ యేడాది మొదట్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 2’ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నారు దర్శక, నిర్మాతలు. ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి.. ‘ఎఫ్ 3’ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేసినట్టు సమాచారం. ఇక ఎఫ్ 3 సీక్వెల్లో వెంకటేష్, వరుణ్ తేజ్‌కు తోడుగా రవితేజ కూడా నటించబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ సీక్వెల్ వచ్చే యేడాది పట్టాలెక్కనుంది. ప్రస్తుతం వెంకటేస్ చేస్తోన్న ‘అసురన్’ రీమేక్‌తో పాటు వరుణ్ తేజ్ చేతిలో ఉన్న సినిమా పూర్తైయిన తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనుంది.
తాజాగా ఎఫ్ 3 సీక్వెల్ లో విజయ శాంతి ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. తాజాగా అనిల్ రావిపూడి.. మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరే నీకెవ్వరు’ సినిమాలో విజయ శాంతి కథను కీలక మలుపు తిప్పే ఇంపార్టెంట్ రోల్ చేసింది. అలాగే ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 లో కూడా లేడీ అమితాబ్ అలాంటి ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మొత్తానికి అనిల్ రావిపూడి.. సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తూనే ఎఫ్ 3 కోసం విజయ శాంతిని మంచి పాత్ర కోసం లాక్ చేసేసాడు.