news18-telugu
Updated: September 26, 2019, 12:41 PM IST
విజయశాంతి(ట్విట్టర్ ఫోటో)
నిన్న మొన్నటి వరకు రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉన్న లేడీ అమితాబ్ విజయశాంతి సడెన్‌గా మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పింది. ఇన్నేళ్ల తర్వాత రాములమ్మ తిరిగి కెమెరా ముందుకొస్తోందంటే.. ఖచ్చితంగా తనదైన శైలిలో పాత్ర పరిధి ఉంటుందని ఫిక్సయ్యారు ప్రేక్షకులు. తెలుగు ప్రేక్షకులతో లేడీ సూపర్ స్టార్‌గా పిలుపించుకున్న విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన తరవాత సినిమాలకు దూరమైపోయారు. 2006లో వచ్చిన ‘నాయుడమ్మ’ సినిమాలో ఆమె చివరి సారిగా కనిపించారు. ఆ తరవాత మరే సినిమాను ఆమె అంగీకరించలేదు.

విజయశాంతి ఫైల్ ఫోటో (Source: Twitter)
అయితే, 13 ఏళ్ల విరామం తరవాత విజయశాంతి మళ్లీ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె కాలేజీ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉండగానే విజయశాంతి మరో సినిమాకు సైన్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే కొరటాల శివ,చిరంజీవి సినిమాలో హీరోయిన్గా నటిస్తోందన్న వార్తలు వినబడ్డాయి. కానీ ఇప్పటి వరకు కన్ఫామ్ కాలేదు.

చిరంజీవి,విజయశాంతి (File/Photo)
కానీ అనిల్ రావిపూడి ఇటీవలే తన దర్శకత్వంలో రూపొంది గ్రాండ్ సక్సెస్ సాధించిన 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ ’F3’ ప్లాన్ చేస్తున్నారట అనిల్. ఇందులో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించగా ఆ పాత్ర చేయడానికి విజయశాంతి ఆసక్తి చూపిందని సమాచారం.ఏదేమైనా సెకండ్ ఇన్నింగ్స్‌లో విజయశాంతి తన సినిమాల విషయంలో స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
September 26, 2019, 12:41 PM IST