మరో బయోపిక్‌తో కీర్తి సురేష్.. సావిత్రి తర్వాత ఆమె పాత్రలో..

Keerthy Suresh: నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాతవాసి లాంటి సినిమాలతో సగటు హీరోయిన్ అనిపించుకుంది కీర్తి సురేష్. మిగిలిన వాళ్లతో పోలిస్తే ఈమెలో స్పెషల్ ఏం లేదని అంతా లైట్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 24, 2020, 3:01 PM IST
మరో బయోపిక్‌తో కీర్తి సురేష్.. సావిత్రి తర్వాత ఆమె పాత్రలో..
మహానటిగా కీర్తిసురేష్
  • Share this:
నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాతవాసి లాంటి సినిమాలతో సగటు హీరోయిన్ అనిపించుకుంది కీర్తి సురేష్. మిగిలిన వాళ్లతో పోలిస్తే ఈమెలో స్పెషల్ ఏం లేదని అంతా లైట్ తీసుకున్నారు. కానీ అలాంటి సమయంలో వచ్చిన మహానటి సినిమాతో తనేంటో నిరూపించుకుంది కీర్తి. ఎందుకు తాను మిగిలిన హీరోయిన్స్‌తో పోలిస్తే ప్రత్యేకం అనేది ప్రూవ్ చేసుకుంది. ఈ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. సావిత్రి పాత్రకు నిజంగానే ప్రాణం పోసింది ఈమె. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే కీర్తి సురేష్ మాత్రమే.

కీర్తి సురేష్ (Instagram/keerthy suresh)
కీర్తి సురేష్ (Instagram/keerthy suresh)


మహానటి తర్వాత ఈమెతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు వేచి చూస్తున్నా కూడా ఈమె మాత్రం కథల విషయంలో చాలా కేరింగ్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియాతో పాటు నితిన్ హీరోగా వస్తున్న రంగ్ దేలో నటిస్తుంది. ఇదిలా ఉంటే కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని చెప్పడంతో కీర్తి సురేష్ చేసే సినిమాల సంఖ్య దాదాపు తగ్గిపోయింది. ఇప్పుడు మరో లెజెండరీ నటి బయోపిక్‌లో నటించబోతుందనే ప్రచారం జరుగుతుంది.

విజయ నిర్మల కీర్తి సురేష్ (Vijaya Nirmala Keerthy Suresh)
విజయ నిర్మల కీర్తి సురేష్ (Vijaya Nirmala Keerthy Suresh)


కృష్ణ భార్య... దివంగత విజయ నిర్మల జీవిత కథ ఆధారంగా ఒక సినిమా రూపొందించాలని ఆమె తనయుడు నరేష్ ప్రయత్నిస్తున్నాడు. ఇందులో ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను టైటిల్ రోల్ కోసం తీసుకోవాలని చూస్తున్నాడు నరేష్. అయితే ఈ పాత్ర చేయడానికి కీర్తి చాలా డిమాండ్ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన విజయ నిర్మల.. 50 సినిమాలకు దర్శకత్వం కూడా వహించి రికార్డు సృష్టించింది. ఆమె పాత్రలో కీర్తి నటిస్తే మాత్రం అదో సంచలనమే.
Published by: Praveen Kumar Vadla
First published: April 24, 2020, 3:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading