దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పవన్ కళ్యాణ్ సరసన భూమిక.. ?

ఖుషీ తర్వాత మరోసారి జంటగా పవన్ కళ్యాణ్,భూమిక (Twitter/Photo)

ఒక వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. పింక్ రీమేక్‌తో పాటు మరో రెండు సినిమాలు కూడా పవన్ ఓకే చేసాడు. అందులో క్రిష్ సినిమాతో పాటు హరీష్ శంకర్ చిత్రాలున్నాయి. క్రిష్ దర్శకత్వంలో చేయబోయే సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన..

 • Share this:
  ఒక వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే శ్రీరామ్ వేణు దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమా రీమేక్  చేస్తున్నాడు. పింక్ రీమేక్ కోసం కేవలం 25 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడు పవన్. ఈ చిత్రానికి ‘లాయర్ సాబ్’తో పాటు ‘వకీల్ సాబ్’ అనే పేర్లను ఫిల్మ్ చాంబర్‌లో రిజిస్టర్ చేయించాడు. ఇదిలా ఉంటే పింక్ రీమేక్‌తో పాటు మరో రెండు సినిమాలు కూడా పవన్ ఓకే చేసాడు. అందులో క్రిష్ సినిమాతో పాటు హరీష్ శంకర్ చిత్రాలున్నాయి. క్రిష్ దర్శకత్వంలో చేయబోయే సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం పండగ సాయన్న జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన కెరీర్‌లో ఫస్ట్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని  కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు పవన్ కళ్యాణ్.

  పవన్ కళ్యాణ్ (twitter/Pawan Kalyan)
  పవన్ కళ్యాణ్,క్రిష్ (twitter/Pawan Kalyan)


  ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన భూమికను తీసుకోబోతున్నట్టు సమాచారం. అప్పట్లో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ ఖుషీ సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటించారు. అది పెద్ద హిట్టైయిందే తెలిసిందే కదా. ఆ తర్వాత వీళ్లిద్దరు మరోసారి కలిసి నటించలేదు. ఇపుడు క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో భూమికను ఒక హీరోయిన్‌గా తీసుకున్నట్టు సమాచారం. ఇందులో మరో ఇద్దరు హీరోయిన్స్‌కు ఛాన్స్ ఉందంట. రీసెంట్‌గా భూమిక.. బాలకృష్ణ హీరోగా నటించిన ‘రూలర్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత పవన్  కళ్యాణ్, క్రిష్ సినిమాలో ముఖ్యపాత్రలో యాక్ట్ చేసేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం.  గతంలో పవన్.. కృతి కర్బందా, ప్రణీత, అనూ ఇమ్మాన్యుయేల్ వంటి ఫ్లాప్ హీరోయిన్‌లకు పవన్ కళ్యాణ్ అవకాశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: