ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు ఇళయరాజా ట్యూన్‌కు బాలు గానం..

రాజకీయాలతో పాటు సినిమా ఇండస్ట్రీలో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే టాక్ ఉంది. ఇపుడు ఇళయరాజా, ఎస్పీ బాల సుబ్రహ్మాణ్యం చూస్తే అది నిజమే అనిపిస్తోంది. తాజాగా మరోసారి వీళ్లిద్దరు చేతులు కలపడం చూసి సంగీతాభిమానులు ఆనంద పడుతున్నారు.

news18-telugu
Updated: June 2, 2019, 3:42 PM IST
ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు ఇళయరాజా ట్యూన్‌కు బాలు గానం..
ఇళయరాజా సంగీతంలో మళ్లీ పాటలు పాడుతున్న బాలు
news18-telugu
Updated: June 2, 2019, 3:42 PM IST
రాజకీయాలతో పాటు సినిమా ఇండస్ట్రీలో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే టాక్ ఉంది. ఇపుడు ఇళయరాజా, ఎస్పీ బాల సుబ్రహ్మాణ్యం చూస్తే అది నిజమే అనిపిస్తోంది. గతంలో ఎన్నో సంగీత విభావరి కార్యక్రమాల్లో బాలు..ఇళయరాజా స్వరపరిచిన ఎన్నో పాటలు పాడారు. దీనిపై తనకు రాయల్టీ ఇవ్వడం లేదంటూ ఇళయరాజా..బాలుకు కోర్డు నోటీసులు పంపించడం అప్పట్లో పెద్ద సంచలనం అయింది. వివరాల్లోకి వెళితే.. ఇళయారాజా సంగీతానికి బాలు గానం ఎంతగా ట్యూన్ అయిందో సెపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎస్పీ బాలు పాటల గురించి మాట్లాడాల్సి వస్తే...ఇళయారాజా ప్రస్తావన రాక మానదు. అలాగే ఇళయరాజా సంగీతం గురించి చెప్పాలంటే ...బాలు ప్రస్తావన తేకుండా ఉండలేం. వీళ్లిద్దరిదీ లెజెండరీ కాంబినేషన్.

After long time legendary singer s.p.Balasubrahmanyam to play back as a singer in ilayaraja music direction,sp balu,Sp balasubrahmanyam,s. p. balasubrahmaniam,sp balasubrahmanyam (musical artist),s. p. balasubrahmanyam live show,ilayaraja,sp balu ilayaraja,sp balasubrahmanyam ilayaraaja,sp balasubrahmanyam ilayaraaja controversy,sp balasubrahmanyam ilayaraja controversy,sp balasubrahmanyam ilayaraaja again working,sp balasubrahmanyam ilaiyaraajas again worked.sp balasubrahmanyam & ilayaraja hits | tamil mestro music | old ...,ilaiyaraaja,ilayaraja,sp balasubrahmanyam,ilayaraja tamil hits,ilayaraja songs,ilayaraja 75,spb,spb and ilayaraja,ilaiyaraaja 75,p. vasu (film director),ilayaraaja,ilaiyaraja,spb hits,ilaiyaraja songs,illayaraja,spb ilayaraja,ఇళయరాజా,ఎస్పీ బాబు,ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం,ఇళయరాజా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,ఇళయరాజా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వివాదం,ఇళయరాజా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంట్రవర్సీ,మళ్లీ చేతులు కలిపిన ఇళయరాజా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,మళ్లీ కలిసి పనిచేస్తోన్నఇళయరాజా,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
ఇళయరాజా ట్యూన్‌కు బాలూ గానం


ఇద్దరు కలిసి వివిధ భాషలల్లో కొన్ని వందల సంఖ్యలో పాటలు చేసి.. శ్రేతలను అలరించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఇద్దరికీ ఒకరంటే మరొకరికి మంచి గౌరవం కూడా వుంది. అసోంటి ఇళయారాజా...బాలుకు నోటీసులు ఇచ్చారన్న వార్త కొన్నాళ్ల క్రితం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ ఇద్దరు లెజెండ్స్ మళ్లీ కలిసిపోయారు. ఐతే ఈ ఆదివారం ఇళయరాజా 75వ జన్మదినం సందర్భంగా జరిగే సంగీత విభావరిలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కూడా పాల్గొని పాట పాడబోతున్నారు. దీనికి సంబంధించిన రిహార్సల్స్ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా ఇళయరాజా, బాలు మునుపటిలా కలుసుకొని అభిమానుల్లో ఆనందాన్ని కలిగించారు. అంతేకాదు విజయ్ ఆంటోని హీరోగా నటిస్తోన్న ‘తమిళ రసన్’ సినిమా కోసం ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఒక డ్యూయట్ పాడారు. ఈ పాట రికార్డింగ్ సమయంలో వీళ్లిద్దరు ఎంతో ఉత్సాహాంగా కనిపించడంతో సంగీతాభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

First published: June 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...