ఏపీలో సార్వత్రిక ఎన్నికల హడావుడి ముగిసింది. ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇప్పటి వరకు ఎండల్లో ప్రచారం చేసి అలసిపోయిన రాజకీయ నేతలు ఒక్కొక్కరిగా సేద తీరడానికి చల్లటి ప్రదేశాలకు చుట్టి వస్తున్నారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లి వచ్చారు. కానీ నాగబాబు మాత్రం తమ్ముడు స్థాపించిన జనసేన తరుపున నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గాన్ని పూర్తిగా చుట్టేసిన నాగబాబు..అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాజాగా ఎన్నికల తర్వాత అందరు రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ హాయిగా సేద తీరుతారు. కానీ నాగబాబు మాత్రం ఎన్నికల తర్వాత కూడా ప్రజల సమస్యలను తెలుసుకోవడంలో నిమగ్నమయ్యారు. నర్సాపురం నియోజవర్గంలో చెరువులను పరిశీలిస్తున్నారు. తాజాగా నాగబాబు నర్సాపురం నియోజకవర్గంలోని ఒక చెరువును పరిశీలించిని వీడియోను నాగబాబు తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాడు.
మొత్తానికి నర్సాపురంలో జరిగిన ఎన్నికల్లో నాగబాబు గెలుపుపై ధీమాగా ఉన్నట్టు కనబడుతోంది. అందుకే ఎంపీగా ఫలితాలు వెల్లడి కాకపోయినా...ఇప్పటి నుంచే నియోజవర్గ ప్రజల సమస్యలను తెలుసుకునే పనిలో పడ్డాడని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఓడిన నర్సాపురం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. ఏమైనా నాగబాబు ఈ పర్యటన రాజకీయ వ్యూహంలో భాగమే అని అందరు పేర్కొంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP Politics, Jabardasth comedy show, Lok Sabha Elections 2019, Nagababu, Narsapuram S01p09, Telugu Cinema, Tollywood Cinema